Viral Video | మథుర రైల్వే స్టేషన్‌లో నకిలీ పాము.. యువకుడి చేష్టలతో హడలిపోయిన ప్రయాణికులు!

Viral Video | మథుర రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు నకిలీ పాముతో హంగామా చేశాడు. అది చూసి నిజమైన పాము వచ్చిందేమోనని ప్రయాణికులు హడలెత్తిపోయి ప్లాట్‌ఫామ్ నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video | మథుర రైల్వే స్టేషన్‌లో నకిలీ పాము.. యువకుడి చేష్టలతో హడలిపోయిన ప్రయాణికులు!

Viral Video | సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేందుకు నేటి యువత రకరకాల స్టంట్స్, ప్రాంక్స్ చేస్తున్నారు. రీచ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే మథుర రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు నకిలీ పాముతో హంగామా చేశాడు. అది చూసి నిజమైన పాము వచ్చిందేమోనని ప్రయాణికులు హడలెత్తిపోయి ప్లాట్‌ఫామ్ నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో ఏమున్నదంటే..

ఓ యువకుడు రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లో పామును పోలిన ఓ వస్తువును లాక్కుంటూ ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్లాడు. అయితే అతని వెనుక ఉన్న వస్తువును చాలామంది ప్రయాణికులు పాముఅనే భావించారు. దీంతో భయపడిపోయి ఒక్కసారిగా పరుగులు తీశారు. కొందరు ప్రయాణికులు బ్యాగులు పడేసి వెళ్లిపోగా.. మరికొందరు ఆ యువకుడిని చుట్టుముట్టారు. దీనికి సంబంధించిన వీడియోను The Nalanda Index అనే అకౌంట్‌లో షేర్ చేసి, ఆ యువకుడి ప్రాంక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి ప్రాంక్‌లు సరదా కాదు.. ప్రమాదకరమని అన్నారు. ఇవి తొక్కిసలాటకు దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఎవరా యువకుడు?

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తిని రాకేశ్ కుమార్‌గా గుర్తించారు. ఆ యువకుడి ఫేస్‌బుక్‌లో 183K ఫాలోవర్లు ఉండగా.. ఇలాంటి ప్రాంక్ వీడియోలను ఇతర ప్రదేశాల్లో కూడా చేశాడని తెలుస్తోంది.

కాగా సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో సదరు యువకుడిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో గందరగోళం సృష్టించినందుకు సదరు యువకుడిపై కేసు నమోదు చేయాలని ఒకరు కామెంట్ చేయగా.. కనీసం ఒక్కరైనా ఆ యువకుడిని ఎందుకు కొట్టలేదో ఆశ్చర్యంగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఇది కంటెంట్ కాదు.. నేరపూరిత నిర్లక్ష్యమని.. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి నార్త్ సెంట్రల్ రైల్వే‌ను కూడా ట్యాగ్ చేశారు. దీనికి నార్త్ సెంట్రల్ రైల్వే కూడా స్పందించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది.

Read More:

ఆమె కలెక్టర్ అయినా… అమ్మ… అమ్మే! శిశువులతో ఊసులాడి… లాలించి..

లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!