అసైన్డ్ భూముల నివాసాలపై కమిటీ: మంత్రి పొంగులేటి

అసైన్డ్ భూముల్లో నివసిస్తున్న పేదల సమస్యపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

అసైన్డ్ భూముల నివాసాలపై కమిటీ: మంత్రి పొంగులేటి

విధాత : రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గం సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లో దశాబ్ధాలుగా ఇండ్లను కట్టుకుని పేదలు నివసిస్తున్నారని, ఈ సమస్యపై రెండు రోజుల్లో ఉన్నత స్ధాయి కమిటీ వేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆ ఉన్నత స్థాయి కమిటీ కేవలం తెలంగాణలోనే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాలు, తెలంగాణ పరిసర రాష్ట్రాల్లో అసైన్డ్ భూముల్లో ఏర్పడిన నివాస ప్రాంతాల విషయంలో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేస్తుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆ కమిటీ రిపోర్టును అందించేలా చూస్తామని, అసెంబ్లీలో సభ్యులందరి సమక్షంలో రిపోర్టుపై చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకుంటాం అని పొంగులేటి తెలిపారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చిన అసెన్డ్ భూముల్లో ఆ వర్గాల ప్రజలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని, ఆలేరు నియోజకవర్గంలో సుమారు 38 వేల నుంచి 39 వేల మంది అసైన్డ్ భూముల్లో నివాసాలు కట్టుకున్న మాట వాస్తవం అని తెలిపారు. కేవలం ఆలేరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అసైన్డ్ భూముల్లో దశాబ్దాలుగా ఇండ్లను కట్టుకొని పేదలు నివసిస్తున్నారు. అన్నారు. పేదలు, దళితులు, మైనారిటీలు, బీసీలకు నాడు దేశవ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం భూములివ్వగా పట్టాలు వారి పేరుపైనే ఉన్నాయి అని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని చాలాసార్లు సభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీని వేసి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Viral Video | మథుర రైల్వే స్టేషన్‌లో నకిలీ పాము.. యువకుడి చేష్టలతో హడలిపోయిన ప్రయాణికులు!
Iran Allows India | భారత్‌కు ఇరాన్ బిగ్ రిలీఫ్