పోలాండ్..ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ (Poland), ఉక్రెయిన్ (Ukraine) దేశాల పర్యటన ఆసక్తి రేపుతుంది. ఆ రెండు దేశాల పర్యటనకు మోదీ బయలుదేరారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Donald Tusk) ఆహ్వానం మేరకు మోదీ పోలాండ్ పర్యటనకు వెళ్లారు. పోలాండ్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతానికి అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో భారత ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు.
పోలాండ్‌లో 21, 22 తేదీల్లో పర్యటించనున్న మోదీ రెండు రోజుల తర్వాతా 23న ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు. మధ్య యూరప్ దేశాల్లో పోలెండ్ దేశం భారత్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. పోలెండ్ కు చెందిన దాదాపు 30 కంపెనీలు భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అటు, పోలెండ్‌లో భారత్ కు చెందిన 5 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. భారత్ దౌత్య సంబంధాల స్థాపన 70వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సందర్భంగా ఈ పర్యటన జరుగుతుండటం ఆసక్తికరం.
రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం దొరికేనా
ప్రధాని మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ (Jelen Ski)తో మోడీ సమావేశం కానున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతుండటంతో నరేంద్ర మోదీ పర్యటనపై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. అయితే, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటి నుంచో చెప్పుకొస్తుంది. ఇప్పుడు మోదీ కూడా జెలెన్ స్కీతో జరిగే సమావేశంలో అదే వైఖరికి కట్టుబడి ఉండే అవకాశం ఉంది.