Site icon vidhaatha

రేవ్ పార్టీ కేసులో 8 మందికి నోటీసులు.. తెలుగు రాష్ట్రాల మూలలపై ఆరా

27న విచారణకు రావాలని పిలుపు

విధాత: బెంగుళూరు పోలీసులు రేవ్ పార్టీ కేసు విచారణను వేగవంతం చేస్తున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్ టెస్టులో పాజిటీవ్ వచ్చిన ఎనిమిది మందిని ఈ నెల 27న సీసీబీ ముందు హాజరుకావాలని నోటీస్‌లు జారీ చేశారు. అందులో భాగంగా సినీ నటి హేమకు కూడా నోటీస్‌లు జారీ చేశారు. పాజిటీవ్ వచ్చిన ఆ ఎనిమిది మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై బెంగుళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.

రేవ్ పార్టీకి హాజరైన వారిలో 86మందికి నార్కోటిక్ డ్రగ్ టెస్టులో పాజిటీవ్‌గా తేలింది. వారందరిని విడతల వారిగా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని బెంగుళూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ1గా లంకలపల్లి వాసు, ఏ2గా అరుణ్‌కుమార్‌, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్ బాబు, ఏ5గా మహ్మద్ అబుబాకర్‌, ఏ6గా గోపాల్‌రెడ్డి, ఏ 7గా 68యువకులను, ఏ8గా 30మంది యువతులను కేసులో చేర్చారు.

తెలుగు రాష్ట్రాల మూలలపై ఆరా

బెంగళూరు రేవు పార్టీ కేసులో ఏపీ, తెలంగాణ నుంచి పాల్గొన్న వారి వివరాలపై బెంగుళూరు పోలీసులు ఫోకస్ పెట్టారు. రేవ్ పార్టీలో పాల్గొన్న27మంది యువతుమవ్మ 13మంది హైదరాబాద్ నుంచి వెళ్లినవారేనని గుర్తించారు. వారంతా మోడల్స్‌, సీరియల్ నటులు, జూనియర్ ఆర్టిస్టులు. వారిని నటి హేమనే రేవ్ పార్టీకి తీసుకెళ్లారని గుర్తించిన పోలీసులు, నిర్వాహకుడు లంకలపల్లి వాసుకు, హేమకు మధ్య ఉన్న లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇక ఏపీ నుంచి రేవ్ పార్టీకి హాజరైన వారిలో మంత్రి కాకాని వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని సైతం సీసీబీ పోలీసులు గుర్తించారు.

పూర్ణా రెడ్డి అనే వ్యక్తి మంత్రి వాహనాన్ని ఉపయోగించినట్లు తేలగా, పోలీసుల రైడ్స్ సమయంలో ఫామ్ హౌస్ పూర్ణారెడ్డి పారిపోయాడని గుర్తించారు. రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై ఆరా తీస్తున్న పోలీసులు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వారి వ్యవహారాలపై విచారణ కొనసాగిస్తున్నారు. రణధీర్ బాబు డెంటిస్ట్ గా చేస్తుండగా, అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version