Ramdev Baba : లైవ్ లో బాబా రామ్ దేవ్ ఓవర్ యాక్షన్..దిమ్మ తిరిగే షాక్

టీవీ లైవ్ డిబేట్‌లో తన బలాన్ని నిరూపించుకోబోయిన బాబా రామ్‌దేవ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎదురుగా ఉన్న ప్యానెలిస్ట్‌ను ఛాలెంజ్ చేయగా, అతను బాబాను అమాంతం గాలిలోకి ఎత్తి కింద పడేశాడు.

Ramdev Baba

విధాత : యోగా గురువు బాబా రామ్ దేవ్ తన శారీరక ధృడత్వంపై ఓ టీవి లైవ్ డిబెట్ లో చేసిన ఓవర్ యాక్షన్ రివర్సైంది. లైవ్ డిబెట్ మధ్యలో తన బలాన్ని నిరూపించుకోవడానికి ఒక రెజ్లింగ్ ఎత్తుగడను ప్రదర్శించబోయిన రామ్‌దేవ్ బాబా .. ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా దెబ్బతిన్నారు. రామ్‌దేవ్‌ను అమాంతం గాలిలోకి ఎత్తిన ప్యానెలిస్ట్.. స్టూడియో ఫ్లోర్ పై నేలకేసి కొట్టడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అమర్ ఉజాలా లైవ్ డిబేట్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

యోగా గురువు బాబా రామ్‌దేవ్ లైవ్‌ డిబేట్‌లో భాగంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు ఓ ప్యానెలిస్టుతో కుస్తీ పట్టు పట్టాడు. హర్యానాలో ఇది ఫేమస్ అంటూ కొన్ని వ్యాయామాలు చేశారు రామ్‌దేవ్‌. ఆ తరువాత ఛాలెంజ్‌ అంటూ తోటి ప్యానలిస్ట్‌పై లంఘించారు. అయితే ప్రత్యర్థిగా ఉన్న ఆ ప్యానెలిస్ట్.. ఏకంగా ఆయనను పైకి ఎత్తి స్టూడియో ఫ్లోర్ పై కింద పడేశారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్య ఘర్షణ నెలకొనగా.. పిడిగుద్దులు విసురుకున్నారు. పరస్పరం కింద పడేసుకునేందుకు పోరాడారు. ఇదంతా సరదాగానే సాగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద ఈ సీన్ లో రామ్ దేవ్ బాబా కంటే ఆ ఫ్యానలిస్టు బలమే అధికంగా ఉందని తేలిపోయింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. టెలివిజన్ చర్చల సమయంలో రామ్ దేవ్ ఇలాంటి వింత ప్రవర్తనలతో ఆకర్షించడం పరిపాటిగా మారిందని కొందరు..వార్తా వేదికలు “కుస్తీ వేదికలు”గా మారాయని మరికొందరు కామెంట్లు చేశారు. టీఆర్పీల కోసం టీవీ ఛానెల్స్ ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నాయని మరికొందరు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

నవదంపతుల మృతిలో షాకింగ్ వీడియో..రైలులో గొడవ
Bigg Boss 9 | బిగ్‌బాస్ ఫైనల్ వీక్.. క‌ళ్యాణ్–తనూజ మాట‌ల‌తో స‌రికొత్త చ‌ర్చ‌.. గేమ్ కంటే గాసిప్‌కే ఎక్కువ చోటు!

Latest News