విధాత: ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ బీజేపీ పాలిత రాష్ట్రం ఒరిస్సాలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు అధికమవుతుంది. తాజాగా రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన కేవలం 187 హోంగార్డు పోస్టుల కోసం 8,000 మంది అభ్యర్థులు పోటీ పడటం..అందులో ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతుండగా.. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కేవలం రోజుకు రూ.639 వచ్చే హోంగార్డు ఉద్యోగం కోసం ఉన్నత విద్యావంతులు క్యూ కట్టడంపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అభ్యర్థుల రద్దీని అదుపు చేయడానికి డ్రోన్లు వాడాల్సి వచ్చిందంటే అక్కడ నిరుద్యోత సమస్య తీవ్రత అర్థమవుతోందని ఆందోళన వెలిబుచ్చాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ వైఫల్యమే అంటూ విపక్షాలు విమర్శలు దాడి సాగిస్తున్నాయి.
🚨 An airstrip in Odisha’s Sambalpur turns into an exam hall as 8,000 graduates appear for 187 government posts. pic.twitter.com/wLEhCNucdM
— Indian Tech & Infra (@IndianTechGuide) December 20, 2025
ఇవి కూడా చదవండి :
Bharat Taxi App: భారత్ టాక్సీ వచ్చేస్తోందిRukmini Vasanth | అదిరిపోయే లుక్‌లో కాంతారా భామ.. రుక్మిణి బ్యూటిఫుల్ ఫొటోస్
Bharat Taxi App: భారత్ టాక్సీ వచ్చేస్తోంది
