Underwater Bharatanatyam : సముద్రం అడుగున బాలికల భరత నాట్య ప్రద్శరన..వైరల్ వీడియో

పుదుచ్చేరికి చెందిన ఇద్దరు చిన్నారులు సముద్రం అడుగున 20 అడుగుల లోతులో భరతనాట్యం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కోసం వారు చేసిన ఈ సాహసం వైరల్ అవుతోంది.

Underwater Bharatanatyam

విధాత : నాట్యకళ ప్రదర్శనలో ఓ అరుదైన రికార్డు సంచలనంగా మారింది. పుదుచ్చేరికి చెందిన బాలికలు రామేశ్వరం వద్ద సముద్రపు నీటిలో 20 అడుగుల లోతులో భరతనాట్యం ప్రదర్శన చేసి ప్రపంచాన్ని అశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 11ఏళ్ల థారగై, 14ఏళ్ల అశ్విన్ బాలాలు సాంప్రదాయ నృత్య దుస్తులతో రామేశ్వరం వద్ద బంగాళాఖాతంలో 20అడుగుల లోతులో భరత నాట్య ప్రదర్శన చేశారు. సంగీత వాయిద్యాలు లేనప్పటికి..నృత్య ప్రదర్శనల భంగీమలు, హవాభావాలతో నాట్య ప్రదర్శన చేశారు. తమ ప్రదర్శనతో వారు.. కళలు సరిహద్దులను, భాషలను కాదు..సముద్రపు లోతులను కూడా చేరుకుని సృజనాత్మకతకు ఎల్లలు లేవని నిరూపించారు.

ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా సముద్రపు అడుగున థారగై, అశ్విన్ బాలాలు చేసిన భరత నాట్య ప్రదర్శన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. సముద్రంలో ఫ్లాస్టిక్ కాలుష్యం నివారణపై ప్రజల్లో అవగాహాన పెంచేందుకు బాలికలు ఇద్దరు ఈ సాహసోపేత నృత్య ప్రదర్శన నిర్వహించినట్లుగా తెలిపారు. ఫ్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం నుంచి సముద్ర జలాలను కాపాడటం..ప్రకృతిని పరిరక్షించడంతో పాటు మనల్ని మనం కాపాడుకోవడమేనని చెప్పుకొచ్చారు. సముద్రపు అడుగున నృత్య ప్రదర్శనతో బాలికలు ఇచ్చిన నాట్య సందేశం సర్వత్రా వైరల్ గా మారింది.

ప్రొఫెషనల్ డీప్ సీ డైవింగ్ కోచ్ అయిన థారగై తండ్రి ఈ వినూత్న ఆలోచన చేయడం గమనార్హం. ఆయన తన సృజనాత్మక ఆలోచనతో భారతీయ శాస్త్రీయ నృత్య కళను సముద్ర పరిరక్షణతో మిళితం చేయడం ప్రశంసలందుకుంది. సముద్రం నీటి అడుగున బాలికల భరతనాట్యం కేవలం కళాత్మక ప్రదర్శన మాత్రమే కాదని..ప్రపంచానికి సముద్ర కాలుష్య నివారణ దిశకగా ఒక ప్రేరణాత్మక సందేశం అని నిపుణులు, పర్యావరణ వేత్తలు అభినందించారు. 2025 ఏప్రిల్ లో నిర్వహించిన ఈ ప్రదర్శనకు సంబంధించిన 51 సెకన్ల వీడియో క్లిప్ డిసెంబర్ 19న రిపోస్టు చేయబడగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇవి కూడా చదవండి :

Mega Project | పవన్–అల్లు అర్జున్ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధం .. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్?
Imran Khan Wife Bushra Bibi : ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17ఏళ్ల జైలు శిక్ష

Latest News