Mega Project | మెగా ఫ్యాన్స్‌కి, అల్లు ఫ్యాన్స్‌కి ఒకేసారి డబుల్ బొనాంజా లాంటి వార్త ఇది. టాలీవుడ్‌లో మరో భారీ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమవుతోందన్న టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సాధారణ కాంబో కాదు… ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ఇద్దరు టాప్ స్టార్స్‌తో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్ట్. ఆ స్టార్స్ మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ క్రేజీ కాంబోను డైరెక్ట్ చేసే ఛాన్స్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు దక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా లోకేష్ కనగరాజ్ ఓ తెలుగు స్టార్‌తో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనేక పేర్లు వినిపించినా, ఫైనల్‌గా పవన్–అల్లు అర్జున్ కాంబోకి సంబంధించిన కథ కుదిరినట్టు తెలుస్తోంది.
ముందుగా రామ్ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్, ఆపై పవన్ కళ్యాణ్‌తో లోకేష్ సినిమా అంటూ వరుసగా వార్తలు వచ్చాయి. ఒక దశలో రామ్ చరణ్–అల్లు అర్జున్ కాంబినేషన్‌లో లోకేష్ సినిమా ఉంటుందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం, చివరికి పవన్ కళ్యాణ్–అల్లు అర్జున్ దగ్గరే కథ ఫైనల్ అయినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల లోకేష్ కనగరాజ్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరికీ కథను వినిపించాడట. ఆ కథ ఇద్దరికీ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారన్న సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత లోహిత్ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీ సినిమా డేట్స్ కోసమేనని టాక్. దర్శకుడు, కథ రెండూ ఫైనల్ కావడంతో నిర్మాత కూడా ఈ ప్రాజెక్ట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. మేకర్స్ 2026 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ, ఆ సమయంలో అధికారిక ప్రకటనతో పాటు అభిమానులకు పండుగ కానుకలాంటి న్యూస్ ఇవ్వనున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్త బయటికి రావడంతో మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలుసుకోవాలంటే మేకర్స్ నుంచి అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ, ఒక విషయం మాత్రం స్పష్టం… ఈ కాంబో కన్ఫర్మ్ అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తలకిందులు కావడం ఖాయం.
