IRCTC | తక్కువ బడ్జెట్‌లో ఏడు క్షేత్రాల దర్శనం.. స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC | సెలవుల్లో ఆలయాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ తీసుకువచ్చింది. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్‌ ఆలయాలను దర్శించుకునే వీలుంటుంది.

  • Publish Date - May 22, 2024 / 12:00 PM IST

IRCTC | సెలవుల్లో ఆలయాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ తీసుకువచ్చింది. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా ‘దివ్య దక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ’ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్‌ ఆలయాలను దర్శించుకునే వీలుంటుంది. ఈ ప్యాకేజీ ఈ నెల 25న అందుబాటులో ఉన్నది. తొమ్మిదిరోజుల పర్యటన కొనసాగుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు సాగే యాత్ర సికింద్రాబాద్‌ నుంచి మొదలవుతుంది. భారత్‌ గౌరవ్‌ రైలులో సాగే ఈ ప్రయాణంలో సికింద్రాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వేస్టేషన్ల వారు సైతం వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నది.

తొమ్మిది రోజుల పర్యటన ఇలా..

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర తొలి రోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మొదలవుతుంది. కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూర్‌, రేణికుంట స్టేషన్ల మీదుగా ప్రయాణం ఉంటుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండోరోజు తిరువన్నామలై చేరుకుంటారు. హోటల్‌కు చేరుకొని అరుణాచలం క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రామేశ్వరం బయలుదేరి వెళ్తారు. మూడోరోజు రామేశ్వరం చేరుకొని.. ఆలయాలను దర్శించుకొని.. రాత్రి అక్కడే బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం అల్పాహారం ముగించుకొని మధురైకి వెళ్తారు. అక్కడ మీనాక్షి అమ్మవారి దర్శానికి వెళ్తారు.

అనంతరం కన్యాకుమారికి వెళ్తారు. ఐదురోజు కన్యాకుమారికి చేరుకొని రాక్‌ మెమోరియల్‌, గాందీ మండపం, సూర్యాస్తమయం అందాలను వీక్షిస్తారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది. ఆరోజు మార్నింగ్‌ టిఫిక్‌ చేసి త్రివేండ్రం బయలుదేరుతారు. అక్కడ అనంత పద్మనాభుడి దర్శానికి వెళ్తారు. ఆ తర్వాత కోవలం బీచ్‌ సందర్శనకు వెళ్తారు. అదేరోజు సాయంత్రం తిరుచిరాపల్లికి బయలుదేరాల్సి ఉంటుంది. ఏడోరోజు శ్రీరంగం చేరుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి ప్రయాణం మొదలవుతుంది. తొమ్మిదోరోజు ఉదయం సికింద్రాబాద్‌ చేరుకుంటారు. దాంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ఎవరికి ఎంత?

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్రలో మూడు రకాల కేటగిరిలు న్నాయి. కంఫ్టర్‌ కేటగిరిలో సెకండ్‌ ఏసీ, స్టాండర్డ్‌ క్లాస్‌లో థర్డ్‌ ఏసీ, ఎకనమీ క్లాస్‌లో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్ క్లాస్‌ టికెట్ రూ.28,450, స్టాండర్డ్ క్లాస్‌ ధర రూ.21,900 ఎకనమీ క్లాస్‌ టికెట్ ధర రూ.14,250గా నిర్ణయించారు. ఎకనమీ క్లాస్‌ ప్రయాణీకులకు నాన్ ఏసీ గదుల్లో బస, మిగతా ప్రయాణికులకు ఏసీ గదుల్లో బస ఉంటుంది. ఇక సైట్‌ సీయింగ్‌, వాహనాల్లో ప్రయాణం, అల్పహారం అన్నీ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. వివరాలకు irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఐఆర్‌సీటీసీ కోరింది. బ

Latest News