MS Dhoni | కెప్టెన్ కూల్‌గా పేరొందిన ఎంఎస్ ధోని మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో.. పర్సనల్ లైఫ్‌లోనూ అంతే సింపుల్‌గా ఉంటారు. టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగించేందుకు ఇష్టపడుతుంటారు. ఆయన లైఫ్‌స్టైల్‌కు అద్దం పట్టేదే రాంచీ(Ranchi)లోని ఆయన ఫామ్‌హౌస్ కైలాష్‌పతి(Kailashpati). ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్‌హౌస్ కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు.. ఎంఎస్‌డీ వ్యక్తిత్వం, అభిరుచులు, ప్రకృతిపై ఆయన ప్రేమను ప్రతిబింబించే స్థలం.
మూడు సంవత్సరాల కల!
ఈ ఫామ్‌హౌస్ నిర్మాణాన్ని 2014లో ప్రారంభించారు. దీని నిర్మాణానికి సుమారు మూడేళ్ల సమయం పట్టింది. 2017లో ఈ ఫామ్‌హౌస్ నిర్మాణం పూర్తయ్యింది. దీనికి ధోని దంపతులు కైలాష్‌పతి అని పేరు కూడా పెట్టారు. 30వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో లగ్జరీ బంగ్లాతో పాటు గార్డెన్, ఆట స్థలం, గ్యారేజి వంటివి ఉన్నాయి. ఇందులోనే సేంద్రీయ సాగు కూడా చేస్తుండటం విశేషం.
రాంచీ నగరానికి ఇది కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌కు చాలా దగ్గరలో ఉంటుంది. క్రికెట్‌కు చాలా దగ్గరగా.. కాంక్రీట్ జంగిల్‌కు దూరంగా ఉన్న ఈ ఫామ్‌హౌస్ ఉంటుంది. ఇక్కడ వాహనాల రద్దీ ఉండదు.. ఎటు చూసిన పచ్చదనం, నిశ్శబ్దంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. అందుకే భార్య సాక్షి, కుమార్తెతో ధోని ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతారు.
సింపుల్ & లగ్జరీ ఇంటీరియర్ డిజైన్
కైలాష్‌పతి ఫామ్‌హౌస్‌లోని ఇంటీరియర్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వైట్ ఎక్స్‌టీరియర్ + డార్క్ రూఫ్ వంటి న్యూట్రల్ కలర్స్‌తో పాటు పెద్ద పెద్ద విండోలు ఇందులో ఉంటాయి. వుడ్ ఫినిష్‌తో బయటకు సింపుల్‌గా కనిపించినప్పటికీ లగ్జరీ ఫీల్‌ను అందిస్తుంది.
ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్
ధోని ఫామ్‌హౌస్ అతని అభిరుచులను ప్రతిబింబిస్తుంటాయి. ఇందులో ప్రాక్టీస్ కోసం ప్రైవేట్ క్రికెట్ నెట్స్ ఉన్నాయి. అలాగే జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ స్పేస్, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక స్థలం ఉన్నాయి.
డ్రీమ్ గ్యారేజి
ధోనికి బైక్స్, కార్లపై ఉన్న ప్రేమ ప్రపంచం అందరికీ తెలిసిందే. ఈ ఫామ్‌హౌస్‌లోనూ మనకు ఆ ఇష్టం కనిపిస్తుంది. కైలాష్‌పతి ఫామ్‌హౌస్‌లో ధోని ప్రత్యేక గ్యారేజిని ఏర్పాటు చేసి, విలువైన కలెక్షన్‌ను అందులో ఉంచారు. ఈ గ్యారేజిలో 80కి పైగా బైక్స్, 20 వరకు లగ్జరీ కార్లు ఉన్నాయి.
ప్రకృతితో జీవనం
ఈ ఫామ్‌హౌస్‌లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మరో ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇందులో రకరకాల పండు, కూరగాయలను పండిస్తూ.. ప్రకృతితో మమైకమై ధోని జీవనం సాగిస్తుంటారు. ఈ ఫామ్‌హౌస్‌లో స్ట్రాబెర్రీ, జామ, బొప్పాయి, క్యాప్సికమ్ వంటివి పండిస్తుంటారు. అలాగే ఈ ఫామ్‌హౌస్‌లో కుక్కలు, గుర్రాలు కూడా ఉన్నాయి. వాటితోనే ధోని ఎక్కువ సమయం గడిపేస్తుంటారు.
ఈ ఫామ్‌హౌస్ విలువ ఎంతంటే..
రాంచీకి సమీపంలోని ఈ ఫామ్‌హౌస్ విలువ సుమారు 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇన్ని కోట్ల విలువైన ఇంట్లో ఉన్నా ఆయన జీవితం మాత్రం ప్రకృతి మధ్య చాలా సింపుల్‌గా సాగుతుంది.
Read More:
Bhoot | భూత్ సినిమా కోసం వాడిన ఫ్లాట్.. 23 ఏళ్లయినా ఇప్పటికీ ఖాళీగానే ఉంది!
Honda Car Discounts | హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్‌పై 2 లక్షల దాకా డిస్కౌంట్!
