కేసీఆర్ ఇక పర్మినెంట్‌గా ఫౌమ్‌హౌజ్‌కే: కిషన్‌రెడ్డి

విధాత, హైద్రాబాద్ : సీఎం కేసీఆర్ మరో 90రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, ఆ తర్వాతా పర్మినెంట్‌గా ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, కృష్ణా యాదవ్‌లు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మంత్రులే ఓడిపోబోతున్నారన్నారు. అధికారం కోల్పోక తప్పదని తెలుసుకునే సీఎం కేసీఆర్ తొండాట ఆడుతున్నారన్నారు.
రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో తెలంగాణ ప్రజల నినాదమన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ వస్తుంటే సీఎం కేసీఆర్ ఇంట్లో కూర్చోని ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ తెలంగాణకు తొమ్మిదేళ్లలో 9లక్షల కోట్ల నిధులు వెచ్చించిందన్నారు.
మోడీ తెలంగాణ పర్యటనలో తెలంగాణకు పలు కీలకమైన కానుకలు ప్రకటించబోతున్నారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరోసారి రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో కుచ్చుటోపీ పెడుతోందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలే కాదు 60గ్యారెంటీలు ఇచ్చిన ఆ పార్టీని నమ్మబోరన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లేసి వారు గెలిచినా ఆ పార్టీలో ఉండకుండా బీఆరెస్‌లోకే వెలుతారన్నారు.