Bhoot | భూత్ సినిమా కోసం వాడిన ఫ్లాట్.. 23 ఏళ్లయినా ఇప్పటికీ ఖాళీగానే ఉంది!

Bhoot | హారర్ సినిమాలు అంటే ఇప్పటికీ వణుకుపుట్టించే 'భూత్' సినిమా గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఈ సినిమా షూట్ చేసిన ముంబైలోని ఫ్లాట్ 23 ఏళ్లు అయినా ఇప్పటికీ అద్దెకు తీసుకోవడానికి భయపడుతున్నారట. ఈ విషయాన్ని సంచలన దర్శకుడు ఆర్జీవీ బయటపెట్టారు.

Bhoot | హారర్ సినిమాలు అంటే ఇప్పటికే భయపడేలా చేసిన సినిమా ‘భూత్’. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)తీసిన ఈ హారర్ క్లాసిక్ చూస్తే ఇప్పటికీ ఆడియన్స్ భయపడిపోతుంటారు. అయితే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను ఆర్జీవీ బయటపెట్టారు. తాజాగా ముంబై (Mumbai)లో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2026లో పాల్గొన్న ఆర్జీవీ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

భూత్ ఇల్లుగా మారిన ఫ్లాట్.. అద్దెకు అంటే వణుకు!

ముంబై నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ సినిమాను ఏదో పాత బంగళాలో కాకుండా, ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో చిత్రీకరిస్తే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందని ఆర్జీవీ భావించాడట. ఈ క్రమంలోనే 2002లో ముంబై లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న ఒక ఫ్లాట్‌లో 30 రోజుల్లోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత ఆ ఫ్లాట్‌కు దెయ్యం ఇల్లుగా పేరొచ్చింది. అలా 23 ఏళ్లు అయినా కూడా ఎవరూ అక్కడ నివసించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్లాట్ ఖాళీగా ఉండిపోయింది. అని ఆర్జీవీ తెలిపారు.

భూత్ కథ ఏంటి? ఎందుకంత స్పెషల్

ఇండియన్ హారర్ జానర్‌కు భూత్ సినిమా కొత్త స్టైల్‌ను తీసుకొచ్చింది. ఇందులో అజయ్ దేవగణ్, ఊర్మిళ మటోండ్కర్ జంటగా నటించారు. నానా పటేకర్, రేఖ కీలక పాత్రల్లో నటించారు. భూతం ఉన్న ఫ్లాట్‌లోకి దంపతులు వచ్చిన తర్వాత అక్కడ వారికి ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. అయితే అప్పటివరకు ఊరి చివర లేదా పాడుబడిన బంగ్లాలోనే దెయ్యం ఉన్నట్లుగా చూపించేవారు. అలాంటిది నగరం నడిబొడ్డున ఉన్న అపార్ట్‌మెంట్‌లో హారర్ కథను చూపించడం చాలా కొత్త కాన్సెప్ట్. అందుకే ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.

ఊర్మిళను ఎంపిక చేయడం వెనుక ఆసక్తికరమైన కథ

భూత్ సినిమాలో దెయ్యం పట్టిన మహిళగా ఊర్మిళ మటోండ్కర్ అద్భుతమైన నటనను చూపించారు. అయితే ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేయడం వెనుక ఒక కారణం ఉందంట. రంగీలా సినిమాలోని హై రామా పాటలో ఎరుపు రంగు డ్రెస్ వేసుకుని జాకీష్రాఫ్ వైపు ఒక రకమైన ఇంటెన్సీతో ఊర్మిళ చూస్తుంది. ఆ క్లోజప్ షాట్‌లో ఊర్మిళ ఎక్స్‌ప్రెషన్‌కు ఆర్జీవీ చాలా ఇంప్రెస్ అయ్యాడట. ఆ ఎమోషన్ చూసి, భూత్ సినిమాలోని పాత్రకు ఊర్మిళను ఫిక్స్ అయ్యానని ఇటీవల ఆర్జీవీ తెలిపారు. ఏదేమైనా ఆర్జీవీ చెప్పిన విషయం విన్న తర్వాత ముంబైలో ఇంకా భూత్ భయం పోలేదని సినీ అభిమానులు అనుకుంటున్నారు.

Read More:

Nabha Natesh | సిల్క్ పింక్ చీరలో నభా నటేష్ అందాల జాతర

Sreeleela | ఉస్తాద్ బ్యూటీ గ్లామర్.. శ్రీలీల సొగసు చూడతరమా!

Latest News