BMW Bike | భారత మార్కెట్‌లో హై పర్ఫార్మెన్స్ బైక్‌లకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. BMW M 1000 R సూపర్ నేక్‌డ్ బైక్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధరను సుమారు రూ.33.50 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మే 2026 నుంచి ఈ బైక్‌ల డెలివరీ మొదలయ్యే అవకాశం ఉంది.
ఆకట్టుకునే డిజైన్
BMW M 1000 R బైక్ పూర్తిగా స్పోర్ట్స్, అగ్రెసివ్ డిజైన్‌లో వచ్చింది. దీని ముందు భాగంలో ఆర్ఆర్ మోడల్ నుంచి తీసుకున్న డ్యూయల్ ఫ్లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లను కలిగింది. అలాగే బాడీ వర్క్‌లో ఎం వింగ్‌లెట్‌లను పొందుపరిచారు. ఈ వింగ్‌లెట్‌లు ఏరో డైనమిక్ డౌన్‌ఫోర్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. బైక్ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినప్పుడు ముందు చక్రంపై భారాన్ని 11 కిలోల వరకు పెంచగలవు. బ్రేక్ కూలింగ్ కోసం ప్రత్యేక ఎయిర్ డక్ట్స్ కూడా అమర్చారు. ఇవి బైక్ స్థిరత్వాన్ని పెంచుతూ ట్రాక్ లెవల్‌ను కంట్రోల్ చేస్తాయి. ఎం కాంపిటీషన్ ప్యాకేజీతో కార్బన్ వీల్స్, ప్రీమియం ఫినిష్ కూడా అందుబాటులో ఉంది.
ఇంజిన్ నిజంగా మాస్!
ఈ బైక్ 999c ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 13,750 rpm వద్ద 210 హార్స్‌పవర్, 113 Nm అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.2 సెకన్లలోనే 100kmph వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఇది గరిష్టంగా 280 kmph వేగంతో దూసుకెళ్తుంది. ఇక షిఫ్ట్‌క్యామ్ టెక్నాలజీ వల్ల అన్ని rpmల్లో పవర్ డెలివరీ స్మూత్‌గా ఉంటుందని BMW కంపెనీ తెలిపింది.
టెక్నాలజీతో కూడిన బైక్
ఈ బీఎండబ్ల్యూ బైక్ పూర్తిగా ఫీచర్లు, టెక్నాలజీతో నిండిపోయింది. ఈ బైక్‌లో..
* ఎం స్పెసిఫిక్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన 6. అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. దీని సాయంతో M GPS Datalogger, M GPS laptrigger వంటి యాక్సెసరీస్‌లను సులువుగా వాడుకోవచ్చు.
* ఈ బైక్ మల్టిపుల్ రైడింగ్ మోడ్స్‌లను అందిస్తుంది. Rain, Road, Dynamic, Race వంటి రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది.
* ఈ బైక్‌లో డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC) సదుపాయం కూడా ఉంది.
* ఇది ట్రాక్ వినియోగం కోసం రూపొందించిన లాంచ కంట్రోల్ & పిట్ లేన్ లిమిటర్‌తో వస్తుంది. క్రూజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ కూడా ఉన్నాయి.
ధర ఎంతంటే..
ఈ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. బైక్ లైట్ వైట్/ఎం మోటార్‌స్పోర్ట్, వైట్ అల్యూమినియం మ్యాట్ కలర్ ఆప్షన్లు ఈ బైక్‌లో ఉన్నాయి. కాగా, ఈ రెండు కలర్ వేరియంట్ బైక్ ధరను రూ.33.50 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు. ఈ బైక్ డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వీ4 (Ducati Streetfighter V 4), కవాసకి జడ్ హెచ్2 (Kawasaki Z H2), అప్రిలియా ట్యూనో వీ4 (Aprilia Tuono V4) వంటి సూపర్ నేకడ్ సెగ్మెంట్ బైక్‌లకు గట్టి పోటీనిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
Read More:
హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్‌పై 2 లక్షల దాకా డిస్కౌంట్!
5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ కారు.. ఆటోమొబైల్ రంగంలో సంచలనం
