Samsung Galaxy M17e 5G | 15వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ !

Samsung Galaxy M17e 5G | దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ చవకైన ధరలో గెలాక్సీ ఎం17e 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 6000 mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 26 గంటల పాటు నాన్‌స్టాప్‌గా చూడొచ్చు. అలాగే ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తుంది.

samsung-galaxy-m17e-5g- smartphone features and specifications

Samsung Galaxy M17e 5G | దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ చవకైన ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. M సిరీస్‌లో గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్‌ను భారత్‌లో విడుదల చేసింది. 6000 mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 26 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వీడియోలు చూడవచ్చని శాంసంగ్ కంపెనీ చెప్పింది. ఈ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఎం సిరీస్‌లో వచ్చిన ఈ మొబైల్‌లో ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్‌ ఉంది. పిల్ ఆకారపు మాడ్యుల్‌లో అమర్చిన డ్యూయల్ రేర్ కెమెరా కూడా ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ 4జీబీ, 6జీబీ ర్యామ్‌లతో వస్తుంది. 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మొబైల్ ధరను రూ.13,999గా, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మొబైల్ ధరను రూ.15,499గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ధరలో

శాంసంగ్ గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లిట్స్ బ్లూ, వైబ్ వయలెట్ రంగుల్లో లభిస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

* శాంసంగ్ గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్ 6.58 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది గరిష్టంగా 120 Hz రిఫ్రెష్‌ రేట్‌ను, 16 మిలియన్ల రంగులను అందిస్తుంది.

* ఈ స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది దుమ్ము, నీటి తుంపర్లను నిరోధిస్తుంది.

* ఆండ్రాయిడ్ 16 ఆధారిత OneUI8 ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఆరు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు శాంసంగ్ కంపెనీ తెలిపింది.

* ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300ప్రాసెసర్‌తో నడుస్తుంది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.

* కెమెరా వియానికొస్తే.. ఈ మొబైల్ డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో f/1.8 ఎపర్చర్, ఆటోఫోకస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. అలాగే f/2.4 ఎపర్చర్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1080p @ 30fps వరకు వీడియోలను రికార్డు చేయవచ్చు.

* ఇక ఈ మొబైల్ 6000mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జి చేస్తే 26 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్‌ను అందిస్తుందని శాంసంగ్ కంపెనీ చెబుతోంది.

ఇంకా ఏమున్నాయి?

* 5జీ, 4జీ LTE
* వైఫై, బ్లూటూత్ 5.3
* USB Type C
* 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్

మొత్తంగా బడ్జెట్‌లో మంచి బ్యాటరీ, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కోరుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Read More :

Vivo T5x 5G | వివో నుంచి 7200mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటలు సోషల్‌మీడియా చూడొచ్చు!

వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!

స్టూడెంట్స్ కోసం చవకైన 5జీ ఫోన్.. ఒప్పో కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?

Latest News