IRCTC Royal Nepal Package | ఈ వేసవికాలంలో హిమాలయ కొండల అందాలను ఆస్వాదించడంతో పాటు నేపాల్‌లోని బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. రాయల్ నేపాల్ ఎక్స్ – హైదరాబాద్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా నేపాల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన లుంబిని, పోఖరా, ఖాట్మాండు, జనక్‌పూర్ వంటి ప్రాంతాలు ఈసందర్శించవచ్చు. వచ్చే ఏప్రిల్ 16వ తేదీన ఈ టూర్ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు రాత్రులు, ఏడు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి పర్యటన ప్రారంభం కానుంది. గోరఖ్‌పూర్ వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి లుంబినికి ప్రయాణం ఉంటుంది. తిరుగుప్రయాణంలో జనక్‌పర్, దర్బంగా చూసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వస్తారు. మొత్తం 30 మంది ప్రయాణికులతో ఈ టూర్‌ను ఐఆర్‌సీటీసీ ఆఫర్ చేస్తోంది.
ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ పెద్దల నుంచి ఒక్కొక్కరికీ రూ.73,500 ( సింగిల్ ఆక్యుపెన్సీ) వసూలు చేస్తుంది. అదే డబుల్ షేరింగ్ ఆక్యుపెన్సీ అయితే ఒక్కొక్కరికీ రూ.60,400, ట్రిపుల్ ఆక్యుపెన్సీతో అయితే రూ.55,700 చార్జి చేస్తుంది. ఇక పిల్లలకు బెడ్‌తో అయితే రూ.50,300.. బెడ లేకుండా అయితే రూ.34,350 చార్జి చేస్తుంది.
షెడ్యూల్ ఇదీ..
మొదటి రోజు: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి ఉదయం 8.45 గంటలకు చేరుకోవాలి. అక్కడి నుంచి విమానంలో గోరఖ్‌పూర్ చేసుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో లుంబినికి చేరుకుంటారు. అక్కడే రాత్రి భోజనం, బస ఉంటుంది.
రెండో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్‌అవుట్ చేసి పోఖరా బయల్దేరతారు. మధ్యలో వరల్డ్ పీస్ పగోడా, మాయా దేవి ఆలయం దర్శించుకుంటారు. రాత్రి వరకు పోఖరా చేరుకుని అక్కడే ఓటల్‌లో బస చేస్తారు.
మూడో రోజు : ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సరంకోట్ వ్యూ పాయింట్ వద్ద సూర్యోదయం ఆస్వాదిస్తారు. అనంతరం బింద్యాబాసిని మందిరం, దేవిస్ ఫాల్స్ గుప్తేశ్వర మహేదవ్ గుహ, ఫేవా సరస్సులో వంటి కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తారు. రాత్రికి అదే హోటల్‌లో డిన్నర్ ముగించుకుని, బస చేస్తారు.
నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఖాట్మాండ్‌కు బయల్దేరతారు. దారి మధ్యలో మనోకామనా ఆలయాన్ని దర్శిస్తతారు. సాయంత్రం లోకల్ మార్కెట్‌లో షాపింగ్‌కు సమయం కల్పిస్తారు. రాత్రికి ఖాట్మాండ్‌లోనే బస ఉంటుంది.
ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఖాట్మాండ్‌లోని పశుపతి ఆలయం, దర్బార్ స్క్వైర్, రాయల్ ప్యాలెస్, స్వయంభునాథ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.
ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్‌అవుట్ చేస్తారు. ఖాట్మాండ్ నుంచి జనక్‌పూర్‌కు విమానంలో వెళ్తారు. అక్కడ జానకీదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి జనక్‌పూర్‌లోనే బస చేస్తారు.
ఏడో రోజు: జనక్‌పూర్ నుంచి దర్బంగా చేరుకుని, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ప్యాకేజీలో ఉండే సదుపాయాలు
* హైదరాబాద్ – గోరఖ్‌పూర దర్బంగా విమాన టికెట్లు
* ఖాట్మాండ్ – జనక్‌పూర్ విమాన టికెట్లు
* 3 స్టార్ హోటల్‌లో వసతి
* ఆరు రోజుల బ్రేక్‌ఫాస్ట్, ఆరు డిన్నర్
* లోకల్ టూర్ గైడ్ సేవలు
* దర్శనాలకు ప్రవేశ టికెట్లు
* ట్రావెల్ ఇన్సూరెన్స్
ప్యాకేజీలో లేని సదుపాయాలు
* మధ్యాహ్న భోజనం
* విమానంలో భోజనం
* వ్యక్తిగత ఖర్చులు
* డ్రైవర్, గైడ్‌లకు టిప్స్
* ప్యాకేజీలో తెలపని ఇతర సేవలు
ముఖ్యమైన విషయాలు
* నేపాల్ పర్యటనకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా కనీసం 6 నెలల కాలపరిమితి ఉన్న పాస్‌పోర్టుల లేదా ఒరిజినల్ ఓటర్ ఐడీని తీసుకెళ్లాలి.
* హోటల్ చెక్ ఇన్, చెక్ అవుట్ సమయంలో హోటల నిబంధనలు పాటించాలి.
* ప్యాకేజి బుకింగ్ సమయంలోనే పూర్తి డబ్బులు చెల్లించాలి.
* ప్యాకేజీ ధరలు విమాన చార్జీలు, పన్నుల మార్పు కారణంగా మారే అవకాశం ఉంటుంది.
* ప్రయాణం ప్రారంభానికి ముందు క్యాన్సిల్ చేస్తే నిర్దిష్ట నిబంధనల ప్రకారం క్యాన్సిలేషన్ చార్జీలు వర్తిస్తాయి.
Read More:
IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ వివరాలివే!
