India T20 World Cup squad: టీ 20 వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ 15మందితో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో ఆడిన జట్టులోని జితేష్ తో పాటు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ కు ఈ జట్టులో చోటు దక్కలేదు. యశస్వి జైస్వాల్ ను కూడా ఎంపిక చేయలేదు.
కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హర్ధీక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్, జస్పిత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషాన్(వికెట్ కీపర్) లను ఎంపిక చేశారు. ఇదే జట్టు త్వరలో న్యూజిలాండ్ తో జరుగబోయే ఐదు మ్యాచ్ ల టీ 20సిరీస్ లో కూడా ఆడుతుందని బీసీసీఐ వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు జనవరి 11 నుంచి న్యూజిలాండ్.. భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.
టీ 20 వరల్డ్ కప్ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది.
