విధాత : న్యూజిలాండ్ తో జనవరి 11నుంచి జరుగునున్న 3వన్డేల సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. 15మందితో కూడిన జట్టుకు శుభమన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు. జట్టులోకి శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చారు. అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. అయితే శ్రేయస్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సీఓఈ నుంచి ధ్రువీకరణ వస్తేనే తుది జట్టులో ఉంటాడు. యశస్వీ జైస్వాల్, రిషబ్ పంత్ లను కొనసాగించారు. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, సీనియర్ పేసర్ మహ్మద్ షమిలకి మరోసారి నిరాశే ఎదురైంది. జనవరి 11న వడోదర, 14న రాజ్‌కోట్, 18న ఇండో ర్ వేదికగా మ్యాచ్ లు జరుగున్నాయి.
జట్టు వివరాలు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Nuclear Rockets | ఇకపై అణుశక్తితో దూసుకుపోనున్న రాకెట్లు? నష్టాలేంటి? లాభాలేంటి?
Viral Video : వండర్..చేతులు లేకపోయినా ఓకేసారి డోలు, డోలక్ తప్పెట్ల మోత
