విధాత : జనగామ, ఇబ్రహీమ్ పట్నం మున్సిపల్ చైర్మన్ పదవుల ఎన్నిక ప్రక్రియను ఎన్నికల అధికారులు రేపటికి వాయిదా వేశారు. జనగామలో చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ ఎంపీ చాడ కిరణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కౌన్సిల్ హాల్ లో నిరసనకు దిగడంతో ఆర్డీవో గోపి రామ్ చైర్మన్ పదవి ఎన్నికను రేపటికి వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కౌన్సిలర్లతో కలిసి నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లేకున్నప్పటికి అక్రమ పద్దతులతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు.
మరోవైపు ఇబ్రహీమ పట్నం మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నికను కూడా అధికారుల వాయిదా వేశారు. కౌన్సిల్ కార్యాలయం ముందు ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలు నిరసనకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వారు నిరసనకు దిగారు.
ఇవి కూడా చదవండి :
Kayadu Lohar | గోల్డెన్ శారీలో ఫంకీ బ్యూటీ హొయలు.. కాయదు లోహర్ లుక్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు
Gods | మన దేవుళ్లకు అన్ని చేతులు ఎందుకు? దీని వెనకున్న ఇంత పరమార్ధం ఉందా?
