విధాత : ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలాజీ తెస్తున్న వినూత్న మార్పులు.. మానవుల పనిని మరింత సులభతరం చేసేలా అన్ని రంగాల్లో యంత్రాలను, రోబోలను వినియోగంలోకి తెస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబోల రాకతో ఇప్పటికే గనులు, సముద్రాల పరిశోధనలు, ట్రాఫిక్ విధులు, ఇంటి పనులలో వాటిని వినియోగంలోకి తీసుకరావడం తెలిసిందే. అయితే కొత్తగా దేవాలయాలను సందర్శించే భక్తులకు తీర్థం అందించడంతో అర్చకులకు పని తగ్గించే మిషన్లు అందుబాటులోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆలయాల్లో భక్తులకు ‘తీర్థం పంపిణీ మిషన్ ‘లతో తీర్థం పంపిణీ చేస్తున్న ఓ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళలలోని ఓ దేవాలయంలో భక్తులు తమ అరచేతిని ‘డిజిటల్ తీర్థం’మిషన్ సెన్సార్ వద్ద ఉంచగానే నిర్ణీత పరిమాణంలో తీర్థం వారి చేతుల్లో పడుతుంది. డిజిటల్ తీర్థంతో భక్తులకు వేగంగా తీర్థ పంపిణీ తో పాటు అర్చకులపై పనిభారం తగ్గనుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘డిజిటల్ తీర్థం’ వచ్చినట్లుగానే ఇక శఠగోపం మిషన్లు కూడా వచ్చేస్తే మరీ మంచిదంటూ సెటైరికల్ కామెంట్లు పెడుతున్నారు.
టెక్నాలోజీయా అంటే ఇదే వినూత్న మార్పులు అర్చకులతో పనిలేదు, ‘డిజిటల్ తీర్థం’ వచ్చేసింది. ఇక శఠగోపం కూడా వచ్చేస్తే మరీ మంచిది.🙇 pic.twitter.com/5UArfSVNzc
— కన్నేపల్లి✨ సరస #sarc Textrovert. (@Ksravishankar2) February 16, 2026
ఇవి కూడా చదవండి :
One Rupee Clinic | రూపాయికే పేదలకు వైద్యం అందిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న జంట
Women Sell Her Husband For Rs. 1.5 Crores | శుభలగ్నం సీన్ రిపీట్.. భర్తను రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య
