తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక వాయిదా!

తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగిన స్థానిక సంస్థల ఎన్నికలు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పోరేషన్లు, 116మున్సిపాల్టీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నికల ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య కొనసాగాయి. పదవులను దక్కించుకునేందుకు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, క్యాంపు రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, ప్రలోభాలు, ఎక్స్ అఫిషియో ఓట్ల రాజకీయాల మధ్య ఎన్నికలు హోరాహోరిగా సాగాయి. సింహభాగం స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ సాధించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపాల్టీల్లో చైర్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

11 మున్సిపాల్టీల్లో వాయిదా

1.ఇల్లందు 2.సుల్తానాబాద్ 3.ఇబ్రహీంపట్నం 4.కాగజ్‌నగర్ 5.కేతనపల్లి 6.ఖానాపూర్ 7.జహీరాబాద్ 8.ఇంద్రేశం
9.డోర్నకల్ 10.జనగామ 11.తొర్రూరు మున్సిపాల్టీలలో అధికారులు ఎన్నికలు వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల వాయిదాతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను చేజారిపోకుండా మరోసారి క్యాంపులకు తరలించారు.

ఇవి కూడా చదవండి :

Vijay-Rashmika : 26న విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక పెళ్లి
Kayadu Lohar | గోల్డెన్ శారీలో ఫంకీ బ్యూటీ హొయలు.. కాయదు లోహర్ లుక్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు

Latest News