Women sell Her husband for Rs. 1.5 crores | తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శుభలగ్నం’ సినిమా (Shubha Lagnam Movie) గుర్తుందా. ఆ మువీలో హీరో జగపతి బాబును అతని భార్య ఆమని రూ. కోటికి అమ్మేస్తుంది (Women sell Her husband for Rs. 1.5 crores). జగపతిబాబును ప్రేమించిన రోజా రూ.కోటి చెల్లించి అతన్ని కొనుక్కుని వివాహం చేసుకుంటుంది. అనంతరం ఇద్దరూ అదే ఇంట్లో కాపురం కూడా పెడతారు. తాజాగా అదే సీన్ ఇప్పుడు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ (Bhopal)లో రిపీట్ అయ్యింది. అయితే, ఇప్పుడు సినిమాలో కాదండోయ్. నిజ జీవితంలో.
భోపాల్‌కు చెందిన దంపతులకు 23 ఏండ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తన తండ్రి ఆఫీస్‌లో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ అతడి పెద్ద కుమార్తె ఆరోపించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. భార్యభర్తలు, అతని ప్రియురాలిని కౌన్సెలింగ్‌కు పిలిచింది. విచారణ సందర్భంగా తాను తన ప్రియురాలి వద్దే ఉంటానని భర్త తేల్చిచెప్పాడు. అందుకు భార్య అంగీకరించలేదు. భర్తను ఆమెకు అప్పగించాలంటే తనకు పరిహారంగా రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఆమె డిమాండ్‌కు ప్రియురాలు ఓకే చెప్పింది. రూ.కోటి విలువ చేసే డూప్లెక్స్ విల్లాతోపాటూ రూ.27 లక్షల నగదు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఆ సొమ్మును తీసుకున్న భార్య తన భర్తకు విడాకులిచ్చి ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ప్రియురాలు ఇచ్చిన విల్లాకు షిఫ్ట్ అయిపోయింది. ఈ ఖరీదైన విడాకుల వ్యవహారం ప్రస్తుతం టాక్ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తోంది. దీన్ని పలువురు శుభలగ్నం చిత్రంతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. శుభలగ్నం సీన్ మళ్లీ రిపీట్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Cotton Harvesting Machine| పత్తి కోత యంత్రం వచ్చేస్తుందోచ్..!
Jewellery Stolen | పెళ్లి వేదికపైనే.. రూ. 4 లక్షలున్న బ్యాగ్‌ను కొట్టేసిన దొంగ.. షాకింగ్ వీడియో
