Snooker Club | చెంప‌దెబ్బ‌కు ప్ర‌తీకారం.. 30 సెక‌న్ల‌లో 27 సార్లు క‌త్తితో పొడిచారు

snooker club | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ (Bhopal)లో 16 ఏళ్ల ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థిపై ఇద్ద‌రు మైన‌ర్లు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. కేవ‌లం 30 సెక‌న్ల‌లో 27 సార్లు విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో (Boy Stabbed 27 Times In 30 Seconds By Minors) పొడిచారు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 23, 2026, 7:08 pm IST
Read Time: 4 mins
Snooker Club | చెంప‌దెబ్బ‌కు ప్ర‌తీకారం.. 30 సెక‌న్ల‌లో 27 సార్లు క‌త్తితో పొడిచారు

Snooker Club | ఒక్క చెంప దెబ్బ (Slapped) బాలుడి జీవితాన్నే ప్ర‌మాదంలోకి నెట్టింది. ఇద్ద‌రు మైన‌ర్లు ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థిపై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశారు. కేవ‌లం అర‌నిమిషంలో ఏకంగా 20కిపైగాసార్లు క‌త్తితో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ (Bhopal)లో చోటు చేసుకుంది.

భోపాల్‌లోని గౌతమ్‌ నగర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థి రోజూ స్థానిక స్నూకర్‌ క్లబ్ (snooker club)కు వెళ్లేవాడు. అక్క‌డికి మ‌రికొంత‌మంది విద్యార్థులు కూడా వ‌చ్చేవారు. ఈ క్ర‌మంలో గ‌తంలో వారి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఓ బాలుడు మ‌రో ఇద్ద‌రిని చెంప‌దెబ్బ‌లు కొట్టాడు. అది మ‌న‌సులో పెట్టుకున్న ఇద్ద‌రు మైన‌ర్లు అదునుచూసి స‌ద‌రు విద్యార్థిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్నారు.

ఓ రోజు విద్యార్థి స్నూక‌ర్ క్ల‌బ్‌లో ఉండ‌గా.. సినిమా స్టైల్లో క్ల‌బ్‌లోకి ఎంట‌రైన‌ ఇద్ద‌రు మైన‌ర్ బాలురు జోబుల్లోని క‌త్తులు తీసి తోటి విద్యార్థిని కార్న‌ర్ చేసి దాడి చేశారు. కేవ‌లం 30 సెక‌న్ల‌లో 27 సార్లు విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో పొడిచారు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దాడి అనంత‌రం ఇద్ద‌రు మైన‌ర్లు అక్క‌డి నుంచి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు క్ల‌బ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ‌య్యాయి. ఘ‌న‌ట అనంత‌రం దాడికి సంబంధించిన వీడియోల‌ను స‌ద‌రు విద్యార్థులే సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. వారి దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇవి కూడా చదవండి :

Yadadri Temple Brahmotsavam : లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అలంకార సేవలు
Niharika | ఫిల్మ్‌ఫేర్ వేదికపై ‘కమిటీ కుర్రవాళ్లు’ టీమ్‌కు నిరాశ.. నిహారిక ఘాటు స్పందన