Niharika | ఫిల్మ్‌ఫేర్ వేదికపై ‘కమిటీ కుర్రవాళ్లు’ టీమ్‌కు నిరాశ.. నిహారిక ఘాటు స్పందన
Niharika |మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తీసుకొచ్చిన ‘కమిటీ కుర్రవాళ్లు’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Niharika |మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తీసుకొచ్చిన ‘కమిటీ కుర్రవాళ్లు’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలోనూ ఈ సినిమా రెండు కీలక పురస్కారాలను దక్కించుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, అవార్డులు గెలిచినా… టీమ్‌కు పూర్తిస్థాయి ఆనందం దక్కలేదని నిహారిక అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
కొచ్చిలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ Filmfare Awards South వేడుకలో ఈ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి. దర్శకుడు యధు వంశీ ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును అందుకోగా, సందీప్ సరోజ్ ఉత్తమ తొలి నటుడు అవార్డును గెలుచుకున్నారు. కొత్త ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డులు రావడం చిత్రబృందానికి గర్వకారణంగా నిలిచింది. అయితే, అవార్డు స్వీకరించిన విజేతలకు కనీసం విన్నింగ్ స్పీచ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని నిహారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలుగు పరిశ్రమకే కాకుండా తమిళ, కన్నడ పరిశ్రమలకు చెందిన కొత్తవారికీ ఇదే పరిస్థితి ఎదురైందని సమాచారం.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో నిహారిక, “పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టిన వారికి ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై నిలబడి మాట్లాడటం లాంఛనం మాత్రమే కాదు… అది జీవితకాల స్వప్నం” అని పేర్కొన్నారు. పెద్ద ఈవెంట్లలో సమయ పరిమితులు ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, “తొలిసారి అవార్డు గెలుచుకున్న వారికి కనీసం ఒక నిమిషం కేటాయించినా వారిలో అపారమైన ఉత్సాహం నింపుతుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.
నిహారిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ అంశంపై అవార్డు నిర్వాహకులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram