Niharika | గెటప్ శీను నన్ను చాలా లవ్ చేస్తాడు … ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు
Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కెరీర్‌లో కొత్త దిశగా ముందుకు సాగుతోంది. హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, నిర్మాతగా మాత్రం వరుస విజయాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో హిట్ సాధించిన నిహారిక, ఇప్పుడు ‘రాకాస’ అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కెరీర్‌లో కొత్త దిశగా ముందుకు సాగుతోంది. హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, నిర్మాతగా మాత్రం వరుస విజయాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో హిట్ సాధించిన నిహారిక, ఇప్పుడు ‘రాకాస’ అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన సారిక జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నా జీవితంలో నేను కలిసిన బెస్ట్ పర్సన్ గెటప్ శ్రీను. బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఒక చెల్లెల్ని ఎంతగా చూసుకుంటారో, అంత ప్రేమ ఆయన చూపిస్తారు. మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, ఆయన కూడా అంతే కేర్ తీసుకుంటారు అని నిహారిక భావోద్వేగంగా తెలిపింది.
గెటప్ శ్రీనుకు బంపర్ ఆఫర్
షూటింగ్ సమయంలో కన్నా ప్రమోషన్స్ సమయంలో గెటప్ శ్రీనుతో మరింత దగ్గరయ్యానని తెలిపింది. “ఏదైనా టెన్షన్ ఉన్నా ముందుగా రిలాక్స్ అవ్వమని, టీ తాగమని చెప్పే వ్యక్తి ఆయన” అని చెప్పింది.
అదే సమయంలో గెటప్ శ్రీనుకు బంపర్ ఆఫర్ ఇస్తూ, తన తదుపరి ప్రాజెక్ట్ ‘బరి’లో ఆయన నటిస్తారని ప్రకటించింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించనుండగా, వాలీబాల్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది.
‘రాకాస’పై అంచనాలు
‘రాకాస’ చిత్రం కామెడీ, ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
నిర్మాతగా నిహారిక ఎదుగుదల
ప్రస్తుతం నిహారిక కొణిదెల కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ నిర్మాతగా ముందుకు సాగుతోంది. యూట్యూబ్, ఓటీటీ, థియేటర్ అన్నీ ప్లాట్‌ఫారమ్‌లలో హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంటోంది. ఇలా ‘మినిమమ్ గ్యారంటీ’ ప్రొడ్యూసర్‌గా పేరుపొందుతున్న నిహారిక, ‘రాకాస’తో మరో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram