Yadadri Temple Brahmotsavam : లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అలంకార సేవలు

యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గోవర్ధనగిరి అలంకారంలో స్వామి దర్శనం భాసిల్లగా భక్తులు భారీగా తరలివచ్చారు.

Reported by: Tejaswini Nanna | ఆధ్యాత్మికం | Feb 23, 2026, 6:36 pm IST
Read Time: 2 mins
Yadadri Temple Brahmotsavam : లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అలంకార సేవలు

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అలంకార సేవలు వైభవోపేతంగా సాగుతున్నాయి.
ఆరవ రోజు సోమవారం “గోవర్ధనగిరి అలంకార సేవ” లో లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారికి “సింహ వాహన సేవ” నిర్వహించారు.

లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 24న మంగళవారం జగన్మోహినీ అలంకార సేవ, అశ్వ వాహన సేవ, రాత్రి ఎదుర్కోలు వేడుక నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం ఈ నెల 25న నిర్వహించనున్నారు. 26న దివ్యవిమాన రథోత్సవం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు.

ఇవి కూడా చదవండి :

కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి ముసలం.. రాహుల్ కు 32మంది ఎమ్మెల్యేల లేఖ !
ఇంట్లో తండ్రి మృతదేహం.. బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు