• Telugu News
  • /National

కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి ముసలం.. రాహుల్ కు 32మంది ఎమ్మెల్యేల లేఖ !

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి మళ్లీ భగ్గుమంది. కేబినెట్ విస్తరణ కోరుతూ 32 మంది ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీకి లేఖ రాయడం రాజకీయంగా సంచలనంగా మారింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 23, 2026, 5:40 pm IST
Read Time: 5 mins
కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి ముసలం.. రాహుల్ కు 32మంది ఎమ్మెల్యేల లేఖ !

విధాత : దేశ వ్యాప్తంగా పార్లమెంటు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో వరుస ఓటములతో ఢీలా పడిపోతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి త్వరలో ఎన్నికలు జరుగబోతున్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల నాయకత్వాలతో ఎదురవుతున్న తలనొప్పులు మరింత చికాకు పెడుతున్నాయి. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 32మంది కేబినెట్ విస్తరణకు డిమాండ్ చేస్తూ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే తో పొత్తు, సీట్ల సర్ధుబాటు సమస్యలు సవాల్ విసురుతుండగా.. కేరళలో మణిశంకర్ అయ్యర్ వంటి సీనీయర్ నేతలు రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ కు ఓటమి తప్పదని..మళ్లీ పినరయి విజయన్ వామపక్ష ప్రభుత్వమే వస్తుందంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇది చాలదన్నట్లుగా అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో తరచూ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి వంటి వారు మినహా ప్రస్తుతానికి అసమ్మతి నేతలు బయటపడని పరిస్థితుల కారణంగా ఇక్కడ పార్టీకి పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే కర్ణాటకలో మాత్రం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న సీఎం పీఠం మార్పిడి వివాదం పార్టీకి తరచూ పెను సవాల్ విసురుతుంది. రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు తనకు సీఎం పీఠం అప్పగించాలంటూ డీకే శివకుమార్ సహా ఆయన వర్గం తరుచూ గళమెత్తుతున్నారు. ఢిల్లీ పర్యటను సైతం సాగిస్తూ…అధిష్టానం పెద్దలను కలిసి తమ అసమ్మతి స్వరాలను వినిపిస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం ప్రస్తుతానికి అక్కడ సీఎం మార్పు వైపు మొగ్గు చూపడం లేదు.

దీంతో తీవ్ర అసమ్మతికి గురవుతున్న డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు 32 మంది తాజాగా పార్టీ హైకమాండ్ కు రాసిన లేఖ సంచలనంగా మారింది. రాహుల్ గాంధీకి రాసిన లేఖలో వెంటనే కేబినెట్ విస్తరణ చేయాలని, కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పించాలని వారు తమ లేఖలో కోరారు. కాంగ్రెస్ హై కమాండ్ కు కర్నాటక కాంగ్రెస్ డీకే వర్గం రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధిష్టానం వారి డిమాండ్ కు అంగీకరించిన పక్షంలో పార్టీలో అసమ్మతి మరింత ముదరవచ్చన్న ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాలు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

తమిళనాడులో ఎస్ఐఆర్ ఎఫెక్ట్ …74లక్షల ఓటర్లకు కోత !
Viral Video | చీర కోసం కొడుకు ప్రాణాల‌తో చెల‌గాట‌మా..?