Jewellery Stolen | పెళ్లి వేదికపైనే.. రూ. 4 లక్షలున్న బ్యాగ్‌ను కొట్టేసిన దొంగ.. షాకింగ్ వీడియో
రాజస్థాన్ (Rajasthan) జైపూర్ (Jaipur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నూతన వధూవరులు బంధువులతో ఫొటోలు దిగుతూ హడావిడిగా ఉన్న క్రమంలో ఓ వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. వేదికపై బంగారు, నగలు ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను సైలెంట్‌గా తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు.
jewellery Stolen | పెళ్లి (Wedding) అంటే ఆ ఇంట్లో ఉండే హడావుడే వేరు. పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారితో సందడిగా ఉంటుంది. అంతా పెళ్లిపనుల్లో బిజీబిజీగా గడుపుతుంటారు. ఇక వేదికపై వధూవరులు ఫొటోలకు పోజులిస్తూ, వచ్చిన అతిథులను పలకరిస్తూ తీరిక లేకుండా సమయం గడుపుతుంటారు. పక్కన ఏం జరుగుతోందో గమనించే తీరిక కూడా వారికి ఉండదు. అదే అదునుగా ఓ వ్యక్తి భారీ చోరీకి పాల్పడ్డాడు.
పెళ్లి మండపంపై వధూవరులు అతిథులను పలకరించడంలో బిజీగా ఉన్నారు. వారి వెనుకే ఓ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఓ వ్యక్తి ఆ బ్యాగ్‌పై కన్నేశాడు. వధూవరులు బంధువులతో మాటల్లో బిజీగా ఉన్న సమయంలో సైలెంట్‌గా వెనుక నుంచి వచ్చి ఆ బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ దృష్యాలు కార్యక్రమాన్ని రికార్డ్ చేసేందుకు వచ్చిన కెమెరామెన్ వీడియోలో రికార్డయ్యాయి.
రాజస్థాన్ (Rajasthan) జైపూర్ (Jaipur) లోని జగత్ పురాలోని చందన్ వాన్ ప్రాంతంలో ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాగ్ కనిపించకపోవడంతో వారు పెళ్లి వీడియోను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఆ బ్యాగ్‌లో సుమారు రూ. 4 లక్షల నగదు, విలువైన ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి వీడియో ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Jaipur: Man (circled) posed as worker/guest, stole ₹4 lakh jewellery in front of everyone.
This is exactly why there’s always a senior trusted family member who sticks with the jewellery bag + all loose cash during weddings. Most crucial role! 💍🔒
pic.twitter.com/FhnoIVWr7p— Ghar Ke Kalesh (@gharkekalesh) February 14, 2026
ఇవి కూడా చదవండి :
Gods | మన దేవుళ్లకు అన్ని చేతులు ఎందుకు? దీని వెనకున్న ఇంత పరమార్ధం ఉందా?
Conditioned OTT Deal NTRNEEL | నెట్‌ఫ్లిక్స్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’కు ₹125 కోట్లు: విచిత్రమైన షరతు విధించిన ఓటీటీ భాగస్వామి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram