Udaipur Woman Ties Leopard With Rope | వామ్మో చిరుతను కట్టేసిన మహిళ..భర్త పరిస్థితి ఏంటో..!

ఉదయపూర్‌లో మహిళ ఇంట్లోకి వచ్చిన చిరుతను దుప్పటి, తాడుతో కట్టేసి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

udaipur-woman-ties-leopard-at-home-viral-video

విధాత : అప్పడప్పుడు మహిళల సాహసాలు చిత్రంగా అనిపిస్తుంటాయి. సాధారణంగా చిరుత పులి ఎదురు పడితే ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా పారిపోతుంటారు. కాని ఉదయపూర్‌లోని ఓ మహిళ తన ఇంట్లోకి వచ్చిన చిరుత పులిని బంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి అకస్మాత్తుగా ఒక ఇంట్లోకి ప్రవేశించింది. దానిని గమనించిన ఆ ఇంటి మహిళ తప్పించుకునే క్రమంలో దానిపై దుప్పటి విసిరేసింది. దుప్పటిలో చిక్కుకుని అది అటుఇటు పెనుగులాడుతుండగా..దాని ఓ కాలుకు తాడును గట్టిగా కట్టి బంధించింది.

చిరుత పులి ఇంటి తలుపు నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించినా.. కాలుకు కట్టిన తాడును రెండో వైపు పట్టుకుని…మళ్లీ ఇంట్లోకి చొరబడి తన మీదకు దాడి చేయకుండా మంచాన్ని అడ్డుగా పెట్టేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చిరుతను బంధించి ఆ మహిళ సాహసానికి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో చిరుతనే బంధించిన ఆ మహిళ ధైర్యం చూస్తే..పాపం అతని భర్త పరిస్థితి ఏమిటో అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

 

Exit mobile version