• మూడు ట్యాంకర్లను దిగుమతి చేసి ఏపి ప్రభుత్వానికి ఉచితంగా అందజేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ
• రక్షణ శాఖ ప్రత్యేక విమానం లో పశ్చిమ బెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరిన మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు
• కోవిడ్ విపత్తులో రోగుల అవసరాలతో పాటు, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం
• ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత
• పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ నింపుకుని ఏపీకి రానున్నట్యాంకులు
• తెలుగు రాష్ట్రాలకు థాయ్‌లాండ్, సింగపూర్లనుండి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేస్తోన్న మేఘా సంస్థ
• థాయ్‌లాండ్ నుండి తెలంగాణకు 11, ఏపికి సింగపూర్ నుండి 3 ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు
• హైదరాబాదు లోని బొల్లారంలో ఇప్పటికే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన MEIL
• తెలంగాణ , ఏపి, ఒడిషాల్లో కోవిడ్ ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోన్న మేఘా
• గత మూడు వారాలు గా 56014 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేసిన MEIL