విధాత:సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెడీ టూ యూజ్ ఆక్సీజన్ క్యాన్లను కలెక్టర్ ఇంతియాజ్ కు సయ్యద్ అలీమ్ అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆక్సీజెన్ కొరకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అత్యవసర ఆక్సీజెన్ క్యాన్ లు అందుబాటులో కి తీసుకురావటం పై సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు సయ్యద్ అలీం సేవాతర్పత ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారు అందించిన 50 ఆక్సీజెన్ క్యాన్ లను వెంటనే నగరంలోని కోవిడ్ సెంటర్లకు పంపుతామన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ నేత సయ్యద్ అలీం మాట్లాడుతూ ఇప్పటి వరకు 250 ఆక్సీజెన్ క్యాన్ లు పంపిణీ చేశామన్నారు . కరోన సెకండ్ వేవ్ కట్టడికి జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలు కోసం నిరంతరం పనిచేస్తూ,ప్రజా ఆరోగ్యం కొరకు వారు పడుతున్న తపన మాకు ఆదర్శమన్నారు.
*కరోనా ఉదృతంగా ఉన్న వేళా తన వంతు సహాయం గా రెడీ టు యూజ్ ఆక్సీజన్ క్యాన్లుల ను అందిస్తున్న వైసీపీ నేత సయ్యద్ అలీమ్ సేవలను కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ప్రశంసించారు .