Suriya
విధాత: కంగువా డిజాస్టర్ తర్వాత స్టార్ హీరో సూర్య (Suriya) తన రాబోవు సినిమాలపై శ్రద్ధ పెట్టాడు. సూర్య 44వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి జిగర్తాండ2 వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే క్రిస్మస్‌ను పురస్కరించుకుని మేకర్స్ బుధవారం ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు.
ఈమూవీకి ‘రెట్రో’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేశారు. లవ్, లాఫర్, వార్ అనే నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇదిలాఉండా సూర్య ఇటీవల తన అభిమానులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఇకపై ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఏడిది సూర్య నటించిన 44వ చిత్రం రెట్రో, 45వ చిత్రం విడుదల కానున్నాయి.