మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయిలాండ్ నుంచి మరో 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను నేడు దిగుమతి చేసుకొని తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. ఆర్మీ ప్రత్యేక విమానం ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో శుక్రవారం (28.05.2020) మధ్యాహ్నం 2 గంటల సమయంలో 3 క్రయోజనిక్ ట్యాంకులతో బేగంపేటలోన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగింది. మరో 5 క్రయోజనిక్ ట్యాంకులు రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ చేరనున్నాయి.
దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ర్టాలలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ప్రైవేటు అయినా, గవర్నమెంట్ అయినా ఆసుపత్రులలో ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్, ఐసియూ బెడ్స్ ఉంటే వాళ్లు ఖాళీ సిలిండర్లు తీసుకొస్తే వాటిలో ఉచితంగా ఆక్సిజన్ నింపి సరఫరా చేస్తున్నారు. ఇది పూర్తిగా కోవిడ్ రోగుల చికిత్సా అవసరాలకోసం మాత్రమే అందిస్తున్నారు. ఒక్కొక్క సిలిండర్ సామర్థ్యం 7000 లీటర్లు కాగా రోజుకు సరాసరిన కనీసం 10 ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. రోజుకు సరాసరిన 400 సిలిండర్లను ఎంఈఐఎల్ సరఫరా చేస్తోంది. వీళ్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు.