పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

విధాత‌: కన్నడ సినీ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో లక్షలాదిమంది అభిమానులను పునీత్ సంపాదించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరం. పునీత్ మృతిని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఇవ్వాలి. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతిచేకూరాలని […]

  • Publish Date - October 29, 2021 / 10:08 AM IST

విధాత‌: కన్నడ సినీ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో లక్షలాదిమంది అభిమానులను పునీత్ సంపాదించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరం. పునీత్ మృతిని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఇవ్వాలి. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.