Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి రియ‌ల్ ఎస్టేట్‌లో లాభాలే లాభాలు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • Publish Date - September 14, 2025 / 07:10 AM IST

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. పట్టుదల, కృషితో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉండవచ్చు కానీ సమయపాలనతో అధిగమిస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాల కోసం గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు. వీలైనంత వరకు పని ప్రదేశంలో ఆచి తూచి నడుచుకోండి. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆలస్యంగా అయినా ఆశించిన లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న అపార్ధాలు ఏర్పడుతాయి. వివాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలం కాదు. ఎంత కష్టపడినా ఫలితాలు మాత్రం నిరాశ పరుస్తాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు అస్థిరంగా ఉంటాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. కీలక నిర్ణయాల విషయంలో అందరినీ కలుపుకుని పోవడం వలన మేలు జరుగుతుంది. ముందుచూపుతో వ్యవహరిస్తే ఆర్థిక నష్టాలు నివారించవచ్చు. కొత్తగా ప్రారంభించబోయే పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. గతంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికంగా కూడా మేలైన సమయం. ప్రేమ వ్యవహారాల్లో అవగాహన లోపంతో అపార్థాలు ఏర్పడవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కోపావేశాలు అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉంటే మంచిది. అపనిందలు, అపార్ధాలకు దూరంగా ఉండండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సవాళ్లు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం. పట్టుదల, ఏకాగ్రత ఉంటే చేపట్టిన పనుల్లో విజయం తప్పకుండా లభిస్తుంది. ఆర్థికంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలాసాలు, ఆడంబరాలు కోసం పెట్టే ఖర్చులు నివారించండి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉద్రిక్తతలు దూరాన్ని సృష్టించవచ్చు. వివాహిత జంటలు అవగాహన లోపంతో సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగితే చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధనయోగం సూచన ఉంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. వ్యాపారులు కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. ప్రేమికుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. క్రమశిక్షణ, సమయపాలనతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పదవీయోగం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు దక్కుతాయి. రాబడి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సమాచార లోపంతో అపార్ధాలు ఏర్పడవచ్చు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలతో నష్టం కలగవచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉద్రిక్తత చోటు చేసుకోవచ్చు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. నూతన వాహనయోగం ఉంది. ప్రమాదకర ప్రయాణాలు నివారించండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలకు విఘాతం కలగవచ్చు. ఆశించిన ఫలితాలు లభించడానికి ఆలస్యం అవుతుంది. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి ఆదాయం పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు చికాకు పెడతాయి. సరైన ప్రణాళికతో ఆర్థిక ఇబ్బందులు అధిగమించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అవగాహన లోపంతో ఒత్తిడి పెరగవచ్చు, కాబట్టి ప్రశాంతంగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే మనోబలం అవసరం. ఉద్యోగులు సహోద్యోగులతో, అధికారులతో శాంతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వ్యాపారంలో కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఒత్తిడి పెరగకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఇంటా బయటా అందరితో సమన్వయంతో నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ప్రేమికుల మధ్య అపార్ధాలు చోటు చేసుకోవచ్చు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరమైన శుభవార్తలు వింటారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులు ముందుచూపుతో సత్ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. నూతన గృహయోగం ఉంది. సమాజంలో గౌరవం, పరపతి పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులకు శుభయోగాలున్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం.