Aloo Egg Masala | కోడిగుడ్డు కూర( Egg Curry ) చాలా ఈజీగా, త్వరగా అయ్యే కర్రీ. కోడిగుడ్డుతో రకరకాల కర్రీలు తయారు చేయొచ్చు. ఎగ్ ఫ్రై( Egg Fry ), ఎగ్ బుర్జీ( Egg Bhurji ), ఎగ్ కర్రీ.. ఇలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ఆదివారం మాత్రం సరికొత్త స్టైట్‌లో ఆలు ఎగ్ మసాలా( Aloo Egg Masala ) ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోవడం ఖాయం.
అయితే ఈ ఆలు ఎగ్ మసాలా కర్రీని తయారు చేసుకోవడం చాలా సులభం. పిల్లలు ఇష్టంగా తినే బంగాళాదుంపతో కలిపి కోడిగుడ్డు మసాలా కర్రీ చేస్తే.. అందరూ ఇష్టపడుతారని చెప్పొచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించిన బంగాళాదుంపలు – 2
ఉడికించిన కోడిగుడ్లు – 4
నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – అర టీ స్పూన్
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క
లవంగాలు – 3
బిర్యానీ ఆకు – 1
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – ఒక రెమ్మ
తరిగిన ఉల్లిపాయలు – 2
ఎండుమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్త
రిగిన టమాటాలు – 2
పసుపు – పావు టీ స్పూన్కా
రం – అర టీ స్పూన్ధ
నియాల పొడి – ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి – పావు టీ స్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – తగినన్ని
గరం మసాలా – అర టీ స్పూన్
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
ముందుగా ఓ పాత్రలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ మోతాదులు ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఇక ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను ఆ మిశ్రమంలో వేయాలి. ఆలు ముక్కలు బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించాలి. అనంతరం ఉడికించిన కోడిగుడ్లను కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. వేయించిన కోడిగుడ్లు, ఆలు ముక్కలను మరో పాత్రలోకి తీసుకోవాలి.
ముందుగా ఉంచిన పాత్రలో జీలకర్ర, మసాలా దినుసులు వేసి బాగా వేయించాలి. ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. అనంతరం ముక్కలు చేసిన టమాటాను అందులో వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటు వేగిన తర్వాత నీళ్లు పోసి మూత పెట్టాలి. కాసేపటి తర్వాత వేయించిన ఆలు ముక్కలను దాంట్లో వేసి ఉడకబెట్టాలి. వేయించిన కోడిగుడ్లను కూడా అందులో వేయాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత గరం మసాలా వేసి కలపాలి. చివర్లో కొత్తమీర చల్లుకుని పొయ్యి మీద నుంచి కిందకు దించాలి. ఇంకేముంది ఆలు ఎగ్ మసాలా రెడీ.. చపాతీ లేదా అన్నంతో తింటే రుచి అదిరిపోద్ది. మీరు ఓసారి ట్రై చేయండి మరి.