Boda Kakarakaya | బోడ కాకరకాయ వర్షాకాలం( Monsoon )లో విరివిగా లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కడంటే అక్కడ దర్శనమిస్తుంది. పొలం గట్ల వద్ద కూడా ఈ కాకరకాయలు లభిస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ బోడకాకరకాయ( Boda Kakarakaya )కు మార్కెట్‌లో కూడా భలే డిమాండ్ ఉంటుంది. ఖరీదు ఎక్కువైనప్పటికీ.. నూతన దంపతులు( Newly Married Couple ) దీన్ని కొనుగోలు చేసి తింటే.. సంసార జీవితంలో నూతనోత్తేజం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్( Mutton ), చికెన్( Chicken )లో దొరికే పోషకాల కంటే ఎక్కువగా బోడ కాకరకాయలో పోషకాలు విరివిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బోడకాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు..
బోడ కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో జీవక్రియ సమర్థవంతంగా పని చేస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.
ఒత్తిడిని తగ్గించి..
పెళ్లైన కొత్తలో దంపతులిద్దరూ కొంత ఒత్తిడికి లోనవడం సహజం. ఆ ఒత్తిడిని తగ్గించే లక్షణం కాకరకాయలో ఉంది. ఒత్తిడిని దూరం చేసి.. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది బోడకాకరకాయ. ఒత్తిడి దూరమైతే.. శృంగార జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించొచ్చు.
నెలసరి సమస్యలకు చక్కటి ఔషధం
ప్రధానంగా మహిళల్లో తలెత్తే నెలసరి సమస్యలకు బోడకాకరకాయ చక్కటి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా నెలసరి సందర్భంగా కడుపు నొప్పితో బాధపడేవారికి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మంపై వచ్చే మొటిమలు, దద్దుర్లు, అలర్జీలను కూడా నిరోధించే లక్షణాలు బోడకాకరకాయలో ఉన్నాయి.
బీపీ కంట్రోల్..
రక్తపోటు (బీపీ), మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అందుకే ఖరీదైనప్పటికీ, బోడకాకరకాయలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.