Chicken | నాన్ వెజ్ ప్రియుల‌కు ఊర‌ట‌.. త‌గ్గిన కోడి కూర ధ‌ర‌లు..!

Chicken | నాన్ వెజ్ ప్రియుల‌కు( Non Veg Lovers ) శుభ‌వార్త‌. వారంలో క‌నీసం మూడు నాలుగు రోజులు కోడి కూర( Chicken ) తినేవారికి ఊర‌ట క‌లిగింది. ఎందుకంటే చికెన్ ధ‌ర‌లు భారీగా త‌గ్గిపోయాయి. దాదాపు రూ. 100 వ‌ర‌కు త‌గ్గ‌డంతో.. మాంసాహారులు పండుగ చేసుకోనున్నారు.

Chicken | మొన్న‌టి వ‌ర‌కు సంక్రాంతి పండుగ‌, ఆ త‌ర్వాత మేడారం జాత‌ర నేప‌థ్యంలో రాష్ట్రంలో చికెన్( Chicken ) ధ‌ర‌లు అమాంతం పెరిగి ఆకాశాన్నంటాయి. సంక్రాంతి, మేడారం ముగియ‌డంతో.. కోడి కూర ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌స్తుతం ఎలాంటి పండుగ‌లు లేక‌పోవ‌డంతో.. చికెన్ డిమాండ్ త‌గ్గింది. దీంతో ధ‌ర‌లు కూడా త‌గ్గిపోయాయి. ఈ క్ర‌మంలో నాన్ వెజ్ ప్రియులు( Non Veg Lovers ) కూడా కోడి కూర తినేందుకు మొగ్గు చూపుతున్నారు.

ప్ర‌స్తుతం కిలో చికెన్ ఎంతంటే..?

జ‌న‌వ‌రి నెల‌లో కోడి కూర ధ‌ర‌లు కొండెక్కాయి. ఏకంగా రూ. 300 పైనే చికెన్ ధ‌ర‌లు ఉండేవి. కానీ గ‌త వారం రోజుల నుంచి చికెన్ ధ‌ర‌లు తగ్గుతూ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం కిలో చికెన్ రూ. 240కే ల‌భిస్తోంది. జ‌న‌వ‌రి మాసంతో పోల్చితే రూ. 100 మేర త‌గ్గింది. రిటైల్ మార్కెట్‌లో లైవ్ చికెన్ రూ.140గా కొనసాగుతోండగా.. డ్రెస్‌డ్ రూ.220గా ఉంది. స్కిన్‌లెస్ కేజీ చికెన్ రూ.240 నుంచి రూ. 250 మధ్య పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో అటుఇటుగా మార్పులు ఉంటాయి. ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరడంతో కోళ్ల లభ్యత కూడా ఎక్కువగా ఉంది. దీంతో చికెన్ ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నాయి. ఇక కోళ్ల ఉత్పత్తి మరింతగా తగ్గితే ధరలు ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు.

కోడిగుడ్డు ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం..!

చికెన్ తిన‌లేని వారు కోడిగుడ్లు తింటారు. మొన్న‌టి వ‌ర‌కు ఈ గుడ్ల ధ‌ర‌లు కూడా అత్య‌ధికంగా ఉండ‌డంతో సామాన్యులు సైతం కొన‌లేని ప‌రిస్థితి. గ‌త వారం వ‌ర‌కు ఒక్కో కోడిగుడ్డు రూ. 9 ప‌లికింది. ఇప్పుడు ఆ ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డును రూ. 6కి విక్ర‌యిస్తున్నారు. చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధ‌ర‌లు కూడా త‌గ్గిపోవ‌డంతో.. మాంసాహారులు ఊర‌ట చెందుతున్నారు.

Latest News