ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు

విధాత: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ హీరో షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అతనితోపాటు అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ దమేచాకు కూడా బెయిల్‌ వచ్చింది. పూర్తి వివరాలను శుక్రవారం న్యాయస్థానం వెల్లడిస్తుందని సమాచారం. కాగా, ఈ నెల 3న క్రూయిజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌తో పాటు పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

  • Publish Date - October 28, 2021 / 02:58 PM IST