విధాత: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కరీంనగర్ కు చెందిన మాజీ మావోయిస్టు నేత లక్ష్మణ్ రావు పేరుతో కలెక్టర్ ఈ మెయిల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. అందులో చివరగా అల్లాహు అక్బర్ అనే నినాదం ఉంది. మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్ ను బాంబులు పెట్టి లేపేయడంతో పాటు కలెక్టర్ ను కూడా చంపేస్తామని మెయిల్ లో మెన్షన్ చేసినట్టు సమాచారం. బాంబు బెదిరింపు వ్యవహారంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతం డీసీసీ కోటిరెడ్డికి ఆదేశాలిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. పోలీసుల హడావుడి..బాంబు బెదిరింపు సమాచారంతో సిబ్బంది, సందర్శకులు ఉరుకులు పరుగులు పెట్టారు. కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులను, ఉద్యోగులను బయటకు పంపించి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు సాగించారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఇది ఎవరో కావాలని చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ సెక్రటేరియట్ కు కూడా బాంబు బెదిరింపు ఫేక్ కాల్ రావడం గమనార్హం
Medchal: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
విధాత: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కరీంనగర్ కు చెందిన మాజీ మావోయిస్టు నేత లక్ష్మణ్ రావు పేరుతో కలెక్టర్ ఈ మెయిల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. అందులో చివరగా అల్లాహు అక్బర్ అనే నినాదం ఉంది. మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్ ను బాంబులు పెట్టి లేపేయడంతో పాటు కలెక్టర్ ను కూడా చంపేస్తామని మెయిల్ లో మెన్షన్ చేసినట్టు సమాచారం. బాంబు బెదిరింపు వ్యవహారంపై విచారణ చేయాలని […]

Latest News
పోతునూరు రైతుల “వరి” గోస
మళ్లీ పడిపోయిన పసిడి, వెండి ధరలు
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు