విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఆగంతకులు బెదిరింపు ఫోన్ కాల్ లో రెండు బాంబులు పేలుతాయి అంటూ బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే రంగ ప్రవేశం చేసి..కోర్టు లోపల ఉన్న వారిని బయటికి పంపి తనిఖీలు చేపట్టారు.
ఇటీవల నగరంలోని హైకోర్టు, నాంపల్లి కోర్టు, జింఖాన్ క్లబ్, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులలో, ప్రజా భవన్ లకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అవన్ని కూడా ఉత్తుత్తి బెదిరింపులే అని తేలిపోయాయి. అయినప్పటికి పోలీసులు ముందస్తు అప్రమత్తతో తనిఖీలు చేపట్టాల్సి వచ్చింది. ఇదే నెలలోనే తెలంగాణ సీఎంవో కార్యాలయం, లోక్ భవన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Pragathi | రెండో పెళ్లి రూమర్స్‌పై నటి ప్రగతి క్లారిటీ.. “సరైన వ్యక్తి లేకపోతే అదే కష్టం”
Congress protest| బీజేపీ కార్యాలయాల ముట్టడికి దిగిన కాంగ్రెస్..తీవ్ర ఉద్రిక్తతలు
