విధాత:మైలవరం మండల ప్రజా పరిషత్ లో ఎన్నికలు,ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల లో అవకతవకలు జరిగాయని స్థానిక ఎం.పి.డీ.ఓ దేవి రెడ్డి సుబ్బారావు మరియు అధికారులు స్వాహా చేసినట్లు జెడ్పీ సీఈవో కు ఫిర్యాదు.
నిధుల దుర్వినియోగం పై కార్యాలయం లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.మురళీ మోహన్ జెడ్పీ సీఈవో కు లిఖితపూర్వకంగా పిర్యాదు.మైలవరం ఎంపీడీవో కార్యాలయంలోని అవకతవకలపై అందిన ఫిర్యాదు మేరకు ఎంపీడీవో పై విచారణ జరపాలని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయ చంద్ర గాంధీకి ఆదేశాలు జారీ చేసిన జెడ్పీ సీఈఓ కార్యాలయం.