Site icon vidhaatha

ఎట్ట‌కేల‌కు హైదరాబాద్‌.. ఇక్రిశాట్‌లో చిక్కిన చిరుత

విధాత: హైదరాబాద్ ఇక్రిశాట్ లో సంచరిస్తున్న చిరుత పులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. రెండు మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో చిరుత సంచారిస్తుంది. చిరుత సంచారంతో ఆందోళనకు గురైన ఇక్రిశాట్ సిబ్బంది అటవీ శాఖకు సమాచారం అందించారు.

చిరుత జాడను గుర్తించి బంధించేందుకు అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు, బోను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. బోనులో చిక్కిన చిరుతను హైదరాబాద్ జూ పార్కుకు తరలించారు.

Exit mobile version