విధాత:కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా మార్కెట్ లలో ప్రజల రద్దీని నియంత్రించేందుకుగాను ఈ నెల 23వ తేదీ ఆదివారం నగరంలో చేపల హోల్ సేల్ మార్కెట్, రిటైల్ వ్యాపారంను నిషేధించినట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.రవిచంద్ ప్రకటనలో తెలియజేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి మార్కెట్ లలో ప్రజల రద్దీ ని నియంత్రించడానికి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ ఎస్ వారి ఆదేశాలను ప్రకారం నగరంలోని చేపల మర్కెట్లు ఆదివారం మూసి వేయటం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ కబేళా యధావిధిగా పని చేస్తుందన్నారు.
హోల్ సేల్ మరియు రిటైల్ చేపల వర్తకులు మార్కెట్లు వాటి పరిసర ప్రదేశాలలో అమ్మకాలు నిషేధిస్తూ, నిబంధనలు అతిక్రమించిన వారిపై ప్రజారోగ్య చట్టం అనుసరించి చట్ట పరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. మట్టన్ షాపులు, చికెన్ వ్యాపార అందరు విధిగా కోవిడ్ నియమాలు పాటిస్తూ ఉదయం గం.6.00 నుంచి 12.00 గంటల వరకు మాత్రమే విక్రయాలు సాగించుకోవాలన్నారు.వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.రవిచంద్ అన్నారు.