Danam Nagendra : నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా

దానం నాగేందర్ కాంగ్రెస్‌లోనే ఉన్నట్లు, పార్టీ ఫిరాయింపుపై నోటీసులు వచ్చే తర్వాత సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుపై అసెంబ్లీ స్పీకర్ నుంచి ఇంకా తనకు నోటీసులు అందలేదని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. నోటీసులు వచ్చిన తర్వాత అందులో సారాంశాన్ని పరిశీలించి, న్యాయ సలహా తీసుకుని సమాధానం ఇస్తానని దానం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫిరాయింపు వివాదంలోని 10మందిలో ఒక్కొక్కరికి స్పీకర్ నుంచి నోటీసులు వస్తున్నాయని..నోటీసులు వచ్చిన వారు స్పీకర్ కు సమాధానం ఇస్తున్నారన్నారు.

నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పనులు..నిధుల మంజూరు జరిపిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాక చేపట్టిన పనులు..కొత్తగా మంజూరైన పనుల వివరాలను దానం వివరించారు. ఈ రోజు రెడ్డి కాలనీలో సీసీ రోడ్లు, వీధి దీపాలను ప్రారంభించుకున్నామని తెలిపారు.