Site icon vidhaatha

IRCTC | పర్యాటకులకు శుభవార్త..! తక్కువ ధరకు విమానం ప్యాకేజీ..! ఊటీ, మైసూర్, కూర్గ్ చుట్టేయొచ్చు

IRCTC |

ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వాసులకు IRCTC టూరిజం శుభవార్త తెలిపింది. టూర్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ వ్యాలీస్ పేరుతో స్పెషల్‌ టూర్‌ (Tour of South Western Valleys) ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఊటీ, మైసూర్, కూర్గ్, బెంగళూరులోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టి రావొచ్చు.

పర్యటన అంతా విమానంలోనే సాగుతుండగా.. పశ్చిమ కనుమల్లోని పర్యాటక ప్రాంతాలను కవర్‌ చేసేలా ప్యాకేజీని తీసుకువచ్చింది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు టూర్‌ కొనసాగుతుంది. ఈ టూర్‌ ఆగస్ట్‌ 10న విశాఖపట్నం నుంచి మొదలవుతుంది.

పర్యటన ఇలా..

పర్యాటకులు తొలి రోజు ఉదయం 7.40 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరితే 9.15 గంటల వరకు బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఊటీకి వెళ్తారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం ఖాళీ సమయంలో షాపింగ్‌ చేసుకొని.. రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. రెండో రోజు ఊటీ ఫుల్ డే సైట్‌సీయింగ్ ఉంటుంది. దొడ్డబెట్ట, బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, ఊటీ లేక్ అందాలను చూడవచ్చు.

అనంతరం టీ ఫ్యాక్టరీ సందర్శన ఉంటుంది. రాత్రికి ఊటీలోనే మళ్లీ బస చేస్తారు. మూడో రోజు ఊకూర్గ్ సందర్శనకు వెళ్తారు. దారిలో బైలుకుప్పె టిబెటియన్ సెటిల్మెంట్, ఎలిఫ్యాంట్ క్యాంప్ సందర్శన ఉంటుంది. రాత్రికి కూర్గ్‌లో బస చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు సైట్ సీయింగ్ ఉంటుంది తలకావేరీ, తలకావేరీ ఆలయం, భగమండల, భగందీశ్వర ఆలయాలను దర్శించుకుంటారు.

మధ్యాహ్నం భోజనం తర్వాత అబ్బే ఫాల్స్, ఓంకారేశ్వర ఆలయం, రాజా సీట్ సందర్శన ఉంటుంది. రాత్రికి కూర్గ్‌లో బస ఉంటుంది. ఐదో రోజు మైసూర్ బయలుదేరుతారు. అక్కడ మైసూర్ ప్యాలెస్, మైసూజ్ జూ, చాముండీ హిల్స్, చాముండేశ్వరి ఆలయం, బృందావన్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి మైసూరులో బస చేయాల్సి ఉటుంది.

ఆరో రోజు బెంగళూరు బయల్దేరాలి. లాల్‌బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం సందర్శన ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విమానాశ్రయంలో విమానం ఎక్కి తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 6.30 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా..

ఐఆర్‌సీటీసీ టూర్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ వ్యాలీస్ టూర్ ప్యాకేజీ ధర విషయానికి వస్తే ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరు రూ.25,875 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్‌ ఆక్యుపెన్సీలో రూ.26,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.35,210 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో విమాన టికెట్లు, డీలక్స్ హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. వివరాల కోసం http://irctctourism.com/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Exit mobile version