Site icon vidhaatha

ISRO: పీఎస్‌ఎల్‌వీ – సి 61 లో సాంకేతిక సమస్య..

ISRO: ఇస్రో నింగిలోకి పంపించిన పీఎస్‌ఎల్‌వీ – సి 61 లో (PSLV) సాంకేతిక సమస్య తలెత్తింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే ఈ రాకెట్ లో సమస్య వచ్చింది. దీనిపై ఇస్రో చైర్మన్ నారాయణన్ (ISRO Chairman) స్పందిస్తూ.. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం పూర్తి కాలేదని చెప్పారు. సాంకేతిక సమస్య తలెత్తిందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఆదివారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 101వ రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీ – సి 61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్‌తో తీసేందుకు పీఎస్‌ఎల్‌వీ – సి 61 ను నింగిలోకి పంపించారు. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల మీద ఈ రాకెట్ పనిచేస్తుంది.

Exit mobile version