Site icon vidhaatha

Monalisa | ఔరా.. మోనాలిసా! ఇంత‌లో ఎంత మార్పు

Monalisa |

విధాత: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో మోనాలిసాగా వెలుగులోకి వచ్చిన పూసలు అమ్ముకునే అమ్మాయి ఉదంతం అందరికి తెలిసిందే. తన నీలి కళ్లతో..సమ్మోహన దరహాసంతో అందరిని తనవైపు ఆకర్షించిన పూసలమ్మి మోనాలిసాగా పేరొందింది. తనొకొచ్చిన పబ్లిసిటీలో సినిమా..యాడ్స్ అవకాశాలు అందుకున్న మోనాలిసా క్రమంగా మళ్లీ తెరమరుగై తన స్వగ్రామానికి వెళ్లిపోయింది.

తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో గుర్తుపట్టలేనంతగా మేకప్ వేసుకున్న మోనాలిసాను చూసిన నెటిజన్లు మోనాలిసా మళ్లీ తిరిగొచ్చిందంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సరికొత్త లుక్‌లో ముగ్థమనోహరంగా కనిపిస్తున్న మోనాలిసాను చూసిన వారంతా ఇప్పుడు నిజంగా మోనాలిసా హీరోయిన్ గా మారిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందానికి తోడుగా యాక్టింగ్..డాన్స్ నేర్చుకుంటే సినీ వినీలాకాశంలో మోనాలిసా కొత్త తారగా ఎదగవచ్చని సలహా ఇస్తున్నారు.

Exit mobile version