కరోనా మహమ్మారి మరో మారు ఉధృతమవుతున్న వేళ కోవిడ్ ఆసుపత్రులలో పేషెంట్ సహాయకులు ఆకలితో అలమటిస్తున్నారు.ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన వారు కర్ఫ్యూ కారణంగా భోజన సమయానికి హోటల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.
అది గమనించిన వే ఫౌండేషన్ దాతల సహాయంతో ప్రతి రోజు కోవిడ్ ఆసుపత్రులలో పేషెంట్ సహాయకులకి ఆహారం, నీరు అందిస్తున్నారు. అలాగే ఇళ్లులేని మరియు రోడ్డుపక్కన ఉండే వాళ్ళకి యచకులకి కూడా అందిస్తున్నారు.
కరోనా కన్నా ఆకలి అనే భూతాన్ని తరిమి కొట్టడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య తెలిపారు.ప్రతి రోజు సహకరిస్తున్న దాతలకి దన్యవాదములు తెలియజేసారు.