Site icon vidhaatha

Viral | సెలూన్‌లో గోళ్లు కట్‌ చేసే వర్కర్‌.. 13 ఐటీ జాబులు, 8కోట్ల శాలరీ! కట్‌ చేస్తే.. సీన్ రివ‌ర్స్‌

తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఐటీ జాబులు సంపాదిస్తున్నారనే వార్తలు విన్నాం. సరే.. ఏదో బీటెక్‌ పట్టా ఉండి.. పని తెలిసి ఉద్యోగం కోసం ఇలా తప్పుదారి పట్టారని సరిపెట్టుకోవచ్చు. కానీ.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఒక 40 ఏళ్ల వ్యక్తి.. సెలూన్‌లో గోళ్లు కత్తిరించే వర్కర్‌.. ఏకంగా 13 రిమోట్‌ ఐటీ జాబులు కొట్టాడు. అదీ తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి. వాటి ద్వారా దాదాపు మూడేళ్ల పాటు ఏటా 8 కోట్ల జీతం పొందాడు. తనే పనిని నార్త్‌ కొరియాలోని ఇతర వ్యక్తులను ఔట్‌సోర్సింగ్‌ చేయిస్తూ.. దర్జాగా గడిపాడు. ఇప్పుడు మోసం బయటపడి.. దోషిగా తేలాడు. ఈ ఉదంతానికి సంబంధించిన ఆసక్తికర కథనం ఫార్చ్యూన్స్‌లో ప్రచురితమైంది.

వాంగ్‌.. అనే ఈ వ్యక్తి గతంలో నెయిల్‌ సెలూన్‌లో పనిచేసేవాడు. తనను ఉద్యోగాల్లో నియమించుకునేలా అమెరికా కంపెనీలు, అమెరికా ప్రభుత్వ సంస్థల్లో 13 జాబులు సంపాదించాడు. తానొక హైలీ సెన్సిటివ్‌ ఐటీ వర్కర్‌నని, రిమోట్‌గా పనిచేస్తానని నమ్మించాడు. ఇందుకు పలువురు నార్త్‌ కొరియన్ల సహకారం తీసుకున్నాడు. వారితో తన జాబ్‌ వర్క్‌ చేయించాడు. అందుకు వారికి కొంత ముట్టచెప్పేవాడు.

తనకు ఒక గేమింగ్‌ యాప్‌లో విలియమ్‌ జేమ్స్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడని, రిమోట్‌ ఐటీ జాబ్స్‌ తో లీగల్‌గా డబ్బు సంపాదించేందుకు సహాయం చేస్తానని చెప్పాడని వాంగ్‌.. ఎఫ్‌బీఐ అధికారుల ముందు వెల్లడించాడు. అతడు, అతడి సహాయకులు వాగ్‌ కోసం నకిలీ రెజ్యూమె తయారు చేశారు. హవాయి యూనివర్సిటీలో పట్టా పొందినట్టు సర్టిఫికెట్లు పుట్టించారు. సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీగా 16 ఏళ్ల అనుభవం ఉన్నట్టు మరికొన్ని సర్టిఫికెట్లు తయారు చేశారు. సీక్రెట్‌ లెవెల్‌ సెక్యూరిటీ క్లియరెన్స్‌ కూడా తెప్పించారు. వాంగ్‌ సంపాదించిన ఉద్యోగాల్లో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA)లో కాంట్రాక్ట్‌ కూడా ఒకటి.

ఆయనకు ఎఫ్‌ఏఏ అధికారులు ఒక మ్యాక్‌బుక్‌ ప్రో ల్యాప్‌టాప్‌, పర్సనల్‌ ఐడీ కార్డు ఇవ్వడమే కాకుండా.. ప్రభుత్వ వ్యవస్థల్లో, ఫెసిలిటీస్‌లో వెళ్లే యాక్సిస్‌ కూడా కల్పించారు. అయితే.. ఈ జాబ్‌ విధిని తాను నిర్వహించడం కాకుండా వేరే వ్యక్తులను చేయించాడు. చైనాలో కొందరు నార్త్‌ కొరియన్లు.. ఆయనకు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లో పనిచేసేవారు. వీళ్లు ఆఖరుకు వాంగ్‌ తరఫున జూమ్‌ మీటింగ్స్‌ కు హాజరై.. టాస్క్‌లను చర్చించేవాళ్లు. అమెరికా పౌరుల ద్వారా అమెరికాలోని రిమోట్‌ జాబ్‌లను పొందే భారీ ముఠాలో వాంగ్‌ కూడా భాగమని అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ గుర్తించింది. ఈ నేరానికి పాల్పడినందుకు గాను వాంగ్‌కు 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది.

Exit mobile version