Site icon vidhaatha

Manchu: విష్ణుపై.. మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు!

విధాత: మంచు మోహన్ బాబు కుటుంబంలో మరోసారి విభేదాలు రచ్చ కెక్కాయి. మనోజ్ తన అన్న మంచు విష్ణుపై దొంగతనం కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. తాను కూతురు బర్త్ డే కోసం రాజస్థాన్ కు వెళ్లిన సమయంలో జల్‌పల్లిలోని నా నివాసంలో విష్ణు 150మంది అనుచరులతో వచ్చి విధ్వంసం సృష్టించారని, విలువైన వస్తువులను దొంగలించారని ఫిర్యాదులో తెలిపారు.

తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆస్తి వివాదంలో మంచు మనోజ్ కు, తన తండ్రి, సోదరుడితో కొంత కాలంగా గొడవలు సాగుతున్నాయి. ఈ వివాదంలో ఏపీలో, తెలంగాణలో పరస్పరం పలు కేసులు పెట్టుకున్నారు. తాజాగా మనోజ్ తన అన్న విష్ణుపై మరో పోలీస్ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమా షూటింట్ లో బిజీగా ఉన్నారు.

Exit mobile version